ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్నది సాధించింది.. కేంద్రం దగ్గర పట్టుబట్టి మరీ ఆ హైవేకు గ్రీన్‌సిగ్నల్ తెచ్చుకుంది. రహదారిని గొల్లపూడి వరకు విస్తరించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. ఈ హైవేను గొల్లపూడి వరకు ఆరు వరసలుగా విస్తరించాలని ఎంపీ శివనాథ్ కేంద్రాన్ని కోరారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.. ఆయన కూడా కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు నేషనల్ హూవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు ఆమోదం తెలిపారు. ఇప్పుడు 28 కి.మీ అదనంగా పెరిగింది.. అంటే ప్రస్తుతం 226 కి.మీ మేర డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు.. ఈ హైవేతో హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణం మరింత సులువు కానుంది. రద్దీగా ఉంటుంది.. ఈ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ రోడ్డును విజయవాడ సమీపంలోని గొల్లపూడి వరకు విస్తరించాలనే డిమాండ్ వినిపించింది. ముందు నేషనల్ హైవే-65 విస్తరణ మల్కాపురం నుంచి విజయవాడ శివారులోని గొల్లపూడి దగ్గర పశ్చిమ బైపాస్ వరకు చేయాలనుకున్నారు. దాదాపు రూ.8000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే NHAI అధికారులు ఒక ప్రతిపాదన చేశారు. గొల్లపూడి వరకు కాకుండా అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు క్రాస్ అయ్యే కంచికచర్ల వరకే విస్తరించాలని అనుకున్నారు. దీనివల్ల విస్తరణ 226 కి.మీ నుండి 198 కి.మీకు తగ్గుతుంది అన్నారు. ఈ ఆలోచనను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది.. గొల్లపూడి వరకు ఆరు వరుసలు చేయాలని కోరింది. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు గొల్లపూడి మీదుగా వెళుతున్న విజయవాడ పశ్చిమ బైపాస్‌ను నేషనల్ హైవేకు అనుసంధానం చేస్తారు. ఈ నిర్ణయంతో తో పాటుగా హైదరాబాద్-చెన్నై మార్గాన్ని కూడా కనెక్ట్ చేయొచ్చంటున్నారు. ఇబ్రహీంపట్నం, పరిటాల, ఐతవరం ప్రాంతాల్లో బైపాస్‌లు వస్తాయి. అయితే ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర మాత్రం సమస్య ఉందని.. వీటీపీఎస్ కాలువ వరకు ఫ్లైఓవర్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. అప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వైపు వెళ్లే నేషనల్-30 కూడా కనెక్ట్ అవుతుంది అంటున్నారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. ఈ నేషనల్ హైవే విస్తరణతో హైదరాబాద్ నుంచి వచ్చేవారికి అమరావతికి వచ్చేవారితో పాటుగా.. అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి సౌకర్యంగా ఉంటుంది. ఇటు చెన్నై-కోల్‌కతా హైవేకు కూడా అనుసంధానం ఉంటుందని.. ఇటు విజయవాడ ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు.