తెలంగాణ వెదర్ అప్డేట్స్.. నేటి వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన

Wait 5 sec.

తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో వచ్చే మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. పశ్చిమ, వాయువ్య దిశలో ఉపరితల గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో వీస్తాయన్నారు. నేడు ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలుచోట్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలోని పడొచ్చని అంచనా వేశారు. ప్రజలు వాతావరణ మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బలమైన గాలుల కారణంగా చెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. ఈ వాతావరణ పరిస్థితులు రైతులపై సానుకూల ప్రభావం చూపవచ్చు, అయితే ప్రజలు ప్రయాణాలలో, ఇతర కార్యకలాపాలలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మించి తక్కువగా నమోదైంది. రాష్ట్రంలోని 281 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ఆందోళనకరంగా 340 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అయితే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి కాస్త మెరుగుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ద్రోణి ప్రభావంతో ఈ నెల 16 వరకు రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు, వర్గల్‌లో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో 3 సెం.మీ, నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లెలో 2 సెం.మీ వర్షం పడింది.