తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గత నాలుగు దశాబ్దాలుగా కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు కోల శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న కోట.. సినిమాలు పూర్తిగా మానేసి ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్య నటుడిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ఆయన సుమారు 750కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.