Veteran Actor KotaSrinivasa Rao Passes Away at 83(adsbygoogle = window.adsbygoogle || []).push({});ప్రముఖ విలక్షణనటుడు కోట శ్రీనివాసరావు (83) ఇక లేరు ===================తెలుగు చిత్రప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఇక లేరు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామునఫిల్మ్ నగర్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోటశ్రీనివాసరావు జన్మించారు. 1968లో రుక్ష్మిణినివివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.సినిమాల్లోకిరాక ముందు కోట శ్రీనివాసరావు స్టేబ్ బ్యాంకులో పనిచేశారు. తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లోకూడా నటించారు. తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు. ప్రతిఘటన (1985), గాయం (1993), తీర్పు (1994), లిటిల్ సోల్జర్స్(1996), గణేష్ (1998), చిన్న (2000), పెళ్లైన కొత్తలో (2006), ఆ నలుగురు (2004), పృథ్వీ నారాయణ (2002) చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. 2012లో చిత్రం వందే జగద్గురుమ్ సినిమాకు సైమా అవార్డుఅందుకున్నారు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారంఅందుకున్నారు. దర్శక నిర్మాత క్రాంతికుమార్.. వెండి తెరపై కోట శ్రీనివాసరావుకుతొలి అవకాశం ఇచ్చారు. 1999- 2004 వరకు విజయవాడతూర్పు నియోజకర్గ భాజపా ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978లో 'ప్రాణం ఖరీదు'తోసినీరంగంలోకి అరంగ్రేటం చేశారు. 4 దశాబ్దాల సినీప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు.తన నటనతోవిలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్లపాటు అలరించిన ఆయన 'ప్రాణం ఖరీదు'తోవెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో సహాయనటుడు, ప్రతి నాయకుడిగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగుప్రేక్షకుల్ని అలరించారు. కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ ఇలా టాలీవుడ్ అగ్ర, యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు. 'అహనా పెళ్ళంట!', 'ప్రతి ఘటన', 'యముడికి మొగుడు', 'ఖైదీ నం: 786', 'శివ', 'బొబ్బిలిరాజా', 'యమలీల', ‘గణేష్’, 'సంతోషం', 'బొమ్మరిల్లు', 'అతడు', 'రేసు గుర్రం' ఇలాంటి ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపుతెచ్చిపెట్టాయి.===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});