Wimbledon Women’sFinal 2025: Iga Swiatek defeats Amanda Anisimova for First Wimbledon Title – Total6 Grand Slam Titles(adsbygoogle = window.adsbygoogle || []).push({});వింబుల్డన్మహిళల సింగిల్స్ ఫైనల్ 2025: తొలి వింబుల్డన్టైటిల్ & ఆరవ గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్==================వింబుల్డన్ 2025 మహిళల సింగిల్స్ ఫైనల్ అంటే హోరాహోరీ తప్పదనుకున్నారంతా.కానీ కేవలం 57 నిమిషాల్లోనే మహిళలసింగిల్స్ ఫైనల్లో ఫలితం తేలిపోయింది. మ్యాచ్ అత్యంత ఏకపక్షంగా ముగిసిపోయింది.పోటీ లేదు.. పోరాటం లేదు. ఆటంతా ఒకరిదే. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండాచెలరేగిపోయిన స్వైటెక్.. తొలిసారి వింబుల్డన్ ట్రోఫీని కైవసం చేసుకుంది.ఆధిపత్యం, దూకుడు, క్లాస్ అన్ని కలబోసిఅదరగొట్టేసిన ఈ పోలెండ్ స్టార్.. టైటిల్ ను ఎగరేసుకుపోయింది. శనివారం ఏకపక్షంగా సాగినపోరులో ఎనిమిదో సీడ్ స్వైటెక్ 6-0, 6-0తో 13వ సీడ్ అమండా అసిమోవా (అమెరికా)ను చిత్తు చిత్తుగాఓడించింది. ఫైనల్లో ఆటంతా స్వైటెడ్డే. తొలి గేమ్ లోనే అనిసిమోవా సర్వీస్ బ్రేక్అయిపోయింది. బలమైన సర్వీసులు, ప్లేస్మెంట్లతోచూస్తుండగానే 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది స్వైటెక్.గేమ్ గేమ్ కు దూకుడు పెంచిన ఇగా.. ప్రత్యర్థి కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. 24 నిమిషాల్లోనే తొలి సెట్ ను కైవసం చేసుకుంది.రెండో సెట్ లోనూఅనిసిమోవా కోలుకోలేకపోయింది. బలహీనమైన సర్వీసులు, అనవసర తప్పిదాలతో స్వైటెక్ మరింత చెలరేగే అవకాశాన్ని ఇచ్చింది. దీంతో 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది పోలెండ్ స్టార్. రిటర్న్ చేసేక్రమంలో పదే పదే బంతిని నెట్కు కొట్టిన అనిసిమోవా అసహనానికి గురైంది. ఒత్తిడికిగురై తప్పిదాలు చేసింది. దీంతో ఆధిక్యాన్ని 5-0కు పెంచుకున్న స్వైటెక్.. సర్వీస్ నిలబెట్టుకుని తేలిగ్గా సెట్ ను, ట్రోఫీని కైవసం చేసుకుంది. ఒక మెరుపు విన్నర్ తో ఆమె మ్యాచ్ను ముగించింది. స్వైటెక్ 3 ఏస్లు, 10 విన్నర్లు కొట్టింది. ఆరుసార్లు అనిసిమోవా సర్వీస్ బ్రేక్చేసింది. 5 డబుల్ ఫాల్ట్స్, 28 అనవసర తప్పిదాలు చేసిన అనిసిమోవా ఓటమిని కొనితెచ్చుకుంది.ముఖ్యాంశాలు: > స్వైటెక్నెగ్గిన గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లు. నాలుగుసార్లు ఫ్రెంచ్ ఓపెన్, ఒక్కోసారి వింబుల్డన్, యుఎస్ ఓపెన్గెలిచింది.> వింబుల్డన్లో వరుసగా ఎనిమిదో సంవత్సరం కొత్త ఛాంపియన్ అవతరించింది.> ఓపెన్శకంలో ఒక గ్రాండ్ స్లామ్ ఫైనల్లో 6-0, 6-0తో గెలవడం ఇది రెండోసారి మాత్రమే. 1988 ఫ్రెంచ్ ఓపెన్ లో నటాషా జ్వెరెవాను స్టెఫీగ్రాఫ్ ఇంతే తేడాతో ఓడించింది.> 114 ఏళ్ల తర్వాత వింబుల్డన్ టోర్నీలో మహిళల సింగిల్స్ ఫైనల్లో 6-0, 6-0తో నెగ్గడం ఇదే తొలిసారి.> గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఆరుసార్లు తుదిపోరు చేరిన స్వైటెక్ అన్నిసార్లూ నెగ్గింది. ఇలావరుసగా ఆరు ఫైనల్స్ గెలిచిన మార్గరేట్ కోర్ట్, మోనికా సెలెస్లను చేసింది.==================HIGHLIGHTS==================(adsbygoogle = window.adsbygoogle || []).push({});