అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది కూలీలు మృతి

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది . ఆదివారం రాత్రి అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజంపేట నుంచి రైల్వేకోడూరు కు వెళ్తున్న లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. రాజంపేట నుంచి రైల్వేకోడూరుకు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ రెడ్డిపల్లి చెరువు కట్టపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 18 మంది కూలీలు ఉన్నట్లు తెలిసింది.లారీ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలో చిక్కుకున్న 9 మందిని పోలీసులు రక్షించారు. గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారంతా రైల్వే కోడూరు మండలంలోని శెట్టిగుంట గ్రామానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి జనార్దన్‌రెడ్డి స్పందించారు. జిల్లా ఉన్నతాధికారులను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో కూలీలు చనిపోవటం బాధాకరమన్న మంత్రి.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జనార్ధన్ రెడ్డి హాామీ ఇచ్చారు.