హమ్మయ్యా.. తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం రేటు ఎంతకు దిగొచ్చిందంటే?

Wait 5 sec.

Gold Price Fall: భారత్‌లో బంగారానికి ఉండే ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహిళలకు అత్యంత ఇష్టమైన వస్తువు ఇదే. పసిడి ఆభరణాలు ధరించేందుకు ఇష్టపడుతుంటారు. అలాగే బంగారం గొప్ప పెట్టుబడి సాధనంగానూ చెప్పవచ్చు. అత్యవసరం సమయంలో బంగారం ఆదుకుంటుంది. అందుకే ప్రతి ఒక్కరు తమ వద్ద బంగారం ఉండాలనుకుంటారు. తమ స్థోమతకు తగినట్లు కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇటీవలి కాలంలో బంగారం రేట్లు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసింది. 10 గ్రాముల బంగారం రేటు లక్ష రూపాయలకు చేరువైంది. గత వారం రోజుల నుంచి బంగారం రేట్లు వరుసగా పెరుగుతూ వస్తుండడంతో చాలా మంది కొనుగోలుదారులు వెనకడుగు వేశారు.ఇక మరింత తగ్గవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో జూలై 16వ తేదీన తులం బంగారం రేటు ఎంతకు దిగివచ్చిందో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా దిగివస్తున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు క్రితం రోజు 9 డాలర్ల మేర తగ్గగా ఇవాళ మరో 18 డాలర్ల వరకు దిగివచ్చింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు 3331 డాలర్ల స్థాయికి తగ్గింది. మరోవైపు.. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు ఇవాళ 1.59 శాతం మేర తగ్గింది. దీంతో ఔన్స్ సిల్వర్ రేటు 37.81 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు.. గత వారం రోజుల్లో తులం రేటు ఏకంగా రూ.1700 వరకు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో కొనుగోలుదారులు వెనకడుగు వేశారు. ఇవాళ స్వల్పంగా తగ్గి ఊరట కల్పించింది. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులంపై రూ.110 మేర దిగివచ్చింది. దీంతో 10 గ్రాముల ధర రూ.99 వేల 770 స్థాయికి తగ్గింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు తులంపై రూ.100 తగ్గడంతో ఇవాళ్టి రేటు రూ. 91 వేల 450 వద్దకు పడిపోయింది. స్థిరంగానే వెండి రేటు.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి రేటు స్థిరంగానే కొనసాగుతోంది. ఇవాళ కిలో వెండి రేటు రూ. 1,25,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది. అయితే, ఢిల్లీ బెంగళూరు, కోల్‌కతా, ముంబై వంటి నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,15,000గా ఉండడం గమనార్హం. అందుకు ట్యాక్సులు, ఇతర పన్నులు కారణమవుతాయి. పైన పేర్కొన్న బంగారం ధరలు జూలై 16వ తేదీన ఉదయం 7 గంటల సమయంలోనివి. మధ్యాహ్నానికి ధరలు మారుతుంటాయి. ఇక పన్నులు కలిపితే ప్రాంతాలను బట్టి ధరలు వేరుగా ఉంటాయి. అందుకో కొనుగోలు చేసే ముందే తెలుసుకోవడం మంచిది.