ఆంధ్రప్రదేశ్‌కు లులు గ్రూప్ తీపికబురు చెప్పింది.. రాష్ట్రంలో లులు మాల్ ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. లులు ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ విశాఖపట్నం, విజయవాడలో మాల్స్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ రెండు చోట్ల కలిపి రూ.1,222 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 1,500 మందికి ఉపాధి లభిస్తుంది. అయితే విజయవాడలో మాల్ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయింపు చేసింది. విజయవాడలో త్వరలో . ఈ మేరకు గవర్నర్‌పేట-2 ఆర్టీసీ డిపో స్థలాన్ని ప్రభుత్వానికి కేటాయించనున్నారు. గవర్నర్‌పేట-2 డిపో స్థలాన్ని లులు మాల్ కోసం ఎంపిక చేయగా.. ఆ స్థలాన్ని తమకు ఇవ్వాలని ఏపీఐఐసీ ఆర్టీసీని కోరింది. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం పరిశీలన చేస్తోంది. ప్రభుత్వ పెద్దలు కూడా ఈ స్థలాన్ని లులు మాల్‌కు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది.ఎస్‌ఐపీబీ (రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) సమావేశం నిర్వహించగా.. లులు ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్‌పేట-2 స్థలాన్ని కు త్వరలోనే కేటాయించనున్నారు అంటున్నారు. అయితే గతంలో నగరపాలక సంస్థ ఐరన్ ఈ స్థలంలో స్క్రాప్ మెటీరియల్‌తో బొమ్మలతో పార్క్ ఏర్పాటు చేసింది. అయితే ఈ స్థలాన్ని కూడా లులు మాల్‌కు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏర్పాటు చేయాలనుకుంటున్న విజయవాడ సమీపంలోని గవర్నర్‌పేట-2 డిపో స్థలం సుమారు 5 ఎకరాల్లో ఉంది. ఇక్కడ గవర్నర్‌పేట-2తో పాటుగా గవర్నర్-1 డిపోకి చెందిన బస్సులు ఉంటాయి. అంతేకాదు గవర్నర్ పేట 1, 2 డిపోల మేనేజర్ల కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. లులు మాల్ కోసం ఈ స్థలాన్ని ఇస్తే కనుక ప్రత్యామ్నాయంగా గొల్లపూడి దగ్గర ఉన్న 5 ఎకరాల భూమిని ఆర్టీసీకి కేటాయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. గొల్లపూడికి సంబంధించిన ఆ భూమి వివరాలను ఇప్పటికే ఆర్టీసీకి తెలియజేశారు అధికారులు.ప్రస్తుతం ఉన్న గవర్నర్‌పేట-2 డిపో ఉన్న స్థలం మొత్తం ఒకప్పుడు విజయవాడ బస్టాండ్‌, విజయవాడ-1 డిపో కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్న సమయంలో విజయవాడలో ప్రస్తుతం ఉన్న పండిట్ నెహ్రూ బస్టాండ్ నిర్మించి 1990లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయవాడ-1 డిపోని కూడా అక్కడ కొత్త బస్టాండ్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు. అప్పుడు పాత బస్టాండ్ ఉన్న ప్రాంతాన్ని గవర్నర్‌పేట-2 డిపోగా సిటీ బస్సుల కోసం పేరు మార్చారు. విజయవాడలో లులు మాల్‌కు కేటాయించాలనుకుంటున్న ఈ డిపో స్థలం కావాలంటూ ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్‌ కిశోర్‌ ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావుకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుున్నారు. అలాగే లులు మాల్‌కు ఆ స్థలం ఇవ్వాలని ప్రభుత్వం కూడా ఆర్టీసీ ఎండీకి సూచించినట్లు తెలుస్తోంది.