బంగారం ధరలు వరుసగా తగ్గి ఇప్పుడిలా.. తులం గోల్డ్ రేటు హైదరాబాద్‌లో ఎంతంటే?

Wait 5 sec.

Hyderabad : . కేవలం ఒక లోహంగానే కాకుండా, బంగారం అనేది ఆస్తి, భద్రత, శ్రేయస్సు, సాంప్రదాయాలకు ప్రతీక. ముఖ్యంగా మహిళలు బంగారం పట్ల అపారమైన అభిమానాన్ని పెంచుకుంటారు. వారికి బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, కష్టకాలంలో ఆసరాగా నిలిచే ఒక పెట్టుబడి, తరతరాలకు వారసత్వంగా అందించే ఆచారం. పండగలు, శుభకార్యాలు, వివాహాలు వంటి వేడుకల సమయంలో ఈ డిమాండ్ మరింత పెరుగుతుంది. ప్రతీ భారతీయులు ఇంట్లో, ఆడవారికి కనీసం గ్రాము బంగారం అయినా ఉండాలనేది ఒక ఆనవాయితీ. అందుకే, ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా, భారత మార్కెట్‌లో బంగారం కొనుగోళ్లకు ప్రత్యేకమైన గిరాకీ ఎప్పుడూ ఉంటుంది. ఇదే సమయంలో ఉంటుంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ భయాలు, అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సుంకాల హెచ్చరికలు వంటి అంశాలు బంగారానికి డిమాండ్‌ను భారీగా పెంచాయి. పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లడంతో, ప్రపంచ మార్కెట్లో గణనీయంగా పెరిగాయి. దీని ప్రభావం భారత మార్కెట్‌పైనా పడింది.అంతర్జాతీయంగా ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3350 డాలర్ల వద్ద ఉండగా, వెండి రేటు 38 డాలర్లపైనే ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా పెరిగి రూ. 86.210 వద్ద ఉంది. హైదరాబాద్ బంగారం ధరలు..గత రెండు మూడు రోజులుగా దేశీయంగా బంగారం ధరలు తగ్గినట్లు కనిపించినా, ఇప్పుడు మళ్లీ స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర తులంపై (10 గ్రాములు) రూ. 50 పెరిగి రూ. 91,100 వద్ద ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా రూ. 50 పెరిగి 10 గ్రాములకు రూ. 99,380కి చేరుకుంది. దీనికి ముందు రోజు కూడా ఇదే విధంగా ధరలు పెరిగాయి. అయితే, అంతకుముందు మాత్రం వరుసగా రూ. 100, రూ. 450 చొప్పున ధరలు తగ్గిన సంగతి తెలిసిందే.మరోవైపు వెండి రేట్లను చూస్తే, హైదరాబాద్ నగరంలో కిలోపై రూ. 100 స్వల్పంగా తగ్గి రూ. 1,23,900 వద్ద కొనసాగుతోంది. గోల్డ్, సిల్వర్ రేట్లు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండవు. ఇవి ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లు, ఇతర అంశాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు దోహదం చేస్తుంటాయి. ఇంకా.. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగానే ఇక్కడా బంగారం ధరల్లో మార్పులు ఉంటాయని చెప్పొచ్చు. అక్కడ పెరిగితే ఇక్కడా పెరుగుతాయి. అక్కడ తగ్గితే ఇక్కడా తగ్గుతాయి.