తిరుమలలో వసతి గదుల కోసం భక్తులకు నో టెన్షన్.. టీటీడీ కీలక నిర్ణయం

Wait 5 sec.

తిరుమలలోని పాత భవనాలను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ఉపయోగంలోకి తీసుకురావాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. లో నిరుపయోగంగా ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ భవనాన్ని అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ భవన పరిస్థితిపై ఆరా తీస్తూ మరమ్మతులు చేయడం, ఆ ప్రాంతంలో కొత్త భవనాన్ని నిర్మించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. అంతకుముందు హెచ్ వీడీసీ, బాలాజీ నిలయం, తిరుమల మందిరం(ఆంప్రో రెస్ట్ హౌస్) విశ్రాంతి భవనాలను పరిశీలించి పరిస్థితిని బట్టి మరమ్మతులు, పునర్నిర్మాణంపై కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో టీటీడీ సీఈ సత్య నారాయణ, ఈఈ వేణు గోపాల్, డిప్యూటీ ఈవో భాస్కర్, పంచాయతీ & రెవెన్యూ డిప్యూటీ ఈవో వేంకటేశ్వర్లు పాల్గొన్నారు.పాతకాల్వ పేరూరు బండపై వెలసిన వకుళమాత ఆలయానికి భక్తుల రాక పెరుగుతోందని.. ఈ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఛైర్మన్ బీ ఆర్ నాయుడు తెలిపారు. పేరూరు వకుళామాత ఆలయాన్ని టీటీడీ ఛైర్మన్ శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు, క్యూ లైన్లు పరిశీలించారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన పనులపై నివేదిక తయారు చేయాలని టీటీడీ అధికారులకు సూచించారు. తక్షణం చేపట్టాల్సిన పనుల వివరాలను తమ దృష్టికి తీసుకువస్తే టిటిడి బోర్డులో చర్చించి ఆమోదం తెల్పుతామన్నారు. అంతకుముందు ఆలయ అధికారులు, అర్చకులు చైర్మన్ కు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేపట్టి అమ్మవారి శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయానికి శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఆలయంలో ఏర్పాట్లను టీటీడీ ఈవో జె శ్యామలరావు శుక్రవారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పర్యటన సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఈవో ఆలయ పరిసరాలు, పార్కింగ్, క్యూలైన్లు, పాదరక్షలు భద్రపరచు కౌంటర్లు, పుష్కరిణి, జలపాతం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, సీవీ అండ్ ఎస్వో మురళీకృష్ణ, ఎస్ఈలు మనోహర్, వెంకటేశ్వర్లు, విజీవో సురేంద్ర, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఆరోగ్యశాఖ డిప్యూటీ ఈవో సోమన్ నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.