కుప్పం: కన్నతల్లిని స్తంభానికి కట్టేసిన కొడుకు.. ఆరా తీస్తే షాకింగ్ విషయాలు.. మరీ ఇంత దారుణమా!

Wait 5 sec.

ప్రస్తుత సమాజంలో పరిస్థితులు ఎలా తయారయ్యాయో తెలియజేసే ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో మరో దారుణం అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కార్లగట్ట గ్రామంలో ఓ మహిళను ఓ వ్యక్తి స్తంభానికి కట్టేసిన వీడియో వైరల్ అవుతోంది. కుప్పం నియోజకవర్గంలో అరాచకాలు మితిమీరుతున్నాయి.. మహిళలు మీద దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయంటూ ఈ వీడియో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వైరల్ వీడియోపై కుప్పం పోలీసులు స్పందించారు. అసలు సంగతి ఏంటనే దానిపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. దీంతో విస్తుపోవటం పోలీసుల వంతైంది. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం.. శాంతిపురం మండలం కార్లగట్టకు చెందిన మునెయ్యకు ఇద్దరు భార్యలు. మునెమ్మ, గంగమ్మ అనే ఇద్దరు పెళ్లాలు. మునెయ్య ఇటీవలే కాలం చేశారు. పది రోజుల కింద మునెయ్య చనిపోగా.. ఆదివారం కర్మకాండలు కూడా పూర్తి చేశారు. అయితే మునెయ్య చనిపోయిన దగ్గరి నుంచి రెండు కుటుంబాల మధ్య ఆస్తి కోసం తగాదా నడుస్తోంది. ఈ క్రమంలోనే మునెమ్మ కొడుకు సురేష్.. తల్లిని ఇలా పొలాల్లో స్తంభానికి కట్టేసి వీడియో రికార్డ్ చేశాడు. ఆస్తిలో వాటా కావాలంటూ మునెమ్మను స్తంభానికి కట్టేసి.. వీడియో తీశాడు. సానుభూతి పొందాలనే ఉద్దేశంతో తల్లితో కలిసి నాటకం ఆడి.. ఇలా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో వైరల్ అవుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపుజరిగింది. నారాయణపురానికి చెందిన శిరీష అనే మహిళను కొంతమంది చెట్టుకు కట్టేశారు. శిరీష భర్త అప్పులు చేసి ఊరు వదిలేసి వెళ్లిపోగా.. ఆ డబ్బుల కోసం శిరీషను చెట్టుకు కట్టేసి దాడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీంతో. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అలాగే బాధిత మహిళను ఫోన్ ద్వారా పరామర్శించిన చంద్రబాబు.. ఆ కుటుంబానికి రూ.5 లక్షలు సాయం కూడా ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఆ ఘటన తరహాలోనే తమకు కూడా సానుభూతి వస్తుందనే ఉద్దేశంతో సురేష్ ఇలా చేసినట్లు పోలీసులు చెప్తున్నారు.