అంగన్‌వాడీ కేంద్రాలకు 'సీడ్ కిట్స్'.. పిల్లలకు తాజా పండ్లు, కూరగాయలు

Wait 5 sec.

తెలంగాణలోని పోషకాహార ఉత్పత్తి కేంద్రాలుగా మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'పోషణ్ వాటిక' (న్యూట్రి గార్డెన్స్) కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీలకు విత్తన కిట్‌లను అందించనున్నారు. ఈ కిట్‌లలో పాలకూర, తోటకూర, మెంతికూర, టొమాటో, వంకాయ, బెండకాయ వంటి కూరగాయలు, పండ్ల విత్తనాలు ఉంటాయి. వీటిని , అక్కడి చిన్నారులు, గర్బిణీలు, బాలింతలకు తాజా, పౌష్టికాహారాన్ని అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.'పోషణ్ వాటిక' అనేది దేశవ్యాప్తంగా అమలు అవుతున్న పోషణ్ అభియాన్ (జాతీయ పోషణ్ మిషన్)లో ఒక భాగం. పిల్లలు, కౌమార బాలికలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం, పోషకాహార ఫలితాలను మెరుగుపరచడం ఈ మిషన్ లక్ష్యం. అంగన్‌వాడీ కేంద్రాల వద్ద లేదా సమీపంలో ఈ న్యూట్రి-గార్డెన్‌లను ఏర్పాటు చేయటం ద్వారా స్థానికంగా పండించిన పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలను మహిళలు, పిల్లలకు తాజాగా సులభంగా అందించడం దీని వెనుక ఉన్న ఆలోచన.తొలి దశలో రాష్ట్రంలోని 4,500 అంగన్‌వాడీ కేంద్రాలకు విత్తన కిట్‌లను అందిస్తారు. తెలంగాణలో 35,000 పైగా ఉన్నాయి, ఇవి సమీకృత శిశు అభివృద్ధి సేవల (ICDS) కార్యక్రమం కింద మహిళలు, పిల్లలకు వివిధ సేవలను అందిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు తరచుగా పోషకాహార లోపంతో బాధపడుతుండటంతో ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది. పౌష్టికాహారంపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల (NGOs) సహాయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో పంటలు పండించడానికి స్థలం లేని అంగన్‌వాడీ కేంద్రాలలో, మొబైల్ అంగన్‌వాడీ సేవలను ప్రారంభించనున్నారు. ఈ మొబైల్ అంగన్‌వాడీలు వారానికి రెండుసార్లు పౌష్టికాహారాన్ని అందిస్తాయి.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 'తెలంగాణ న్యూట్రిషన్ ప్లాన్'ను ప్రకటించింది. 200 ml పాలు, పల్లీలు, మిల్లెట్ పట్టీలు, వారానికి రెండుసార్లు ఎగ్ బిర్యానీ అందిస్తున్నారు. ఈ చర్యలన్నీ రాష్ట్రంలో పోషకాహార లోపాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు చెబుతున్నారు.