Adani Group: భారతీయ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ నేతృత్వంలోని సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ప్రధాన వ్యాపారాలపైన పోర్ట్స్, గ్రీన్ ఎనర్జీ, పవర్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో.. . ఈ కంపెనీలో తమకు మిగిలి ఉన్న 10.42 శాతం వాటాను శుక్రవారం రోజు ఏకంగా రూ. 3,732 కోట్లకు అమ్మివేసినట్లు అధికారికంగా తెలిసింది. అదానీ గ్రూప్ ఈ వాటాను ఒకేసారి అమ్మలేదు. దశలవారీగా ఈ ప్రక్రియను పూర్తి చేసింది. అసలు ఏం జరిగిందో చూద్దాం.గత సంవత్సరం డిసెంబర్ 2024లోనే అదానీ గ్రూప్ దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. తమ ప్రధాన వ్యాపారాలైన మౌలిక సదుపాయాలపైనే (రోడ్లు, ఓడరేవులు, విద్యుత్ వంటివి) పూర్తిగా దృష్టి పెట్టడానికి AWL అగ్రి బిజినెస్‌లో తమకు ఉన్న 44 శాతం వాటాను పూర్తిగా అమ్మేస్తామని చెప్పింది. గతంలో విల్మార్, అదానీ గ్రూప్ కలిసి అదానీ విల్మార్‌ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని నుంచే బయటికి వచ్చేస్తున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. శుక్రవారం రోజు వాటాల విక్రయంతో పూర్తి స్థాయిలో దాంట్లో నుంచి బయటికి వచ్చిందన్నమాట. ఇక విల్మార్ మాత్రమే ఆ సంస్థలో మెజారిటీ వాటాదారుగా ఉంది. మొదటి విడత అమ్మకం (జనవరి 2025): జనవరి 2025లో, అదానీ కమోడిటీస్ (ఇది అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీలో భాగం) AWL అగ్రిలోని తన వాటాలో 13.5 శాతం షేర్లను మార్కెట్లో ఒక్కో షేరుకు రూ. 276.51 చొప్పున అమ్మింది. దీనివల్ల కంపెనీ షేర్లను సాధారణ ప్రజలు ఎక్కువగా కొనే అవకాశం వచ్చింది.రెండో విడత అమ్మకం (గురువారం, జులై 17): గురువారం, జులై 17న అదానీ గ్రూప్ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. AWL అగ్రి బిజినెస్‌లో తమకు ఉన్న 20 శాతం వాటాను విల్మర్ ఇంటర్నేషనల్, సింగపూర్ అనే కంపెనీకి ఒక్కో షేరుకు రూ. 275 చొప్పున ఏకంగా రూ. 7,150 కోట్లకు విక్రయించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు తెలిపింది. ఈ ఒప్పందం పూర్తయితే, AWL అగ్రిలో విల్మర్ ఇంటర్నేషనల్ వాటా 64%కి పెరిగి, ఆ కంపెనీకి ప్రధాన యజమాని అవుతుంది.చివరి విడత అమ్మకం (శుక్రవారం, జులై 18): గురువారం జరిగిన పెద్ద ఒప్పందం తర్వాత, అదానీ గ్రూప్‌కు AWL అగ్రి బిజినెస్‌లో ఇంకా 10.42 శాతం వాటా మిగిలి ఉంది. శుక్రవారం, జులై 18న, అదానీ కమొడిటీస్‌ ఈ మిగిలిన 10.42% వాటాను (మొత్తం 13,54,82,400 షేర్లు) బహిరంగ మార్కెట్లో రూ. 3,732 కోట్లకు విక్రయించి, AWL అగ్రి బిజినెస్‌ నుంచి పూర్తిగా నిష్క్రమించింది. AWL అగ్రి బిజినెస్ అనేది FMCG (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) రంగంలో పనిచేస్తుంది. అంటే, ఆహార నూనెలు, గోధుమ పిండి, బియ్యం, చక్కెర, సబ్బులు వంటి నిత్యావసర వస్తువులను తయారుచేస్తుంది. ఈ అమ్మకంతో అదానీ గ్రూప్ FMCG రంగం నుంచి పూర్తిగా బయటపడినట్లయింది.