‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’: నర్మద, ప్రేమలను విడగొట్టేసిన శ్రీవల్లి.. జోరు వర్షంలో భోరున ఏడుపు

Wait 5 sec.

శ్రీవల్లి ఫ్యామిలీకి ఆస్తులేం లేవని.. వాళ్ల కోటీశ్వరులు కాదు.. సైకిల్‌పై ఇడ్లీలు అమ్ముకుని బతుకుతారనే విషయం తొలుత కంటపడింది నర్మదకే. ఇడ్లీగాడు ఇడ్లీ అమ్ముతూ నర్మదకే కనిపించాడు. ఆ తరవాత వాళ్లకి సొంత ఇల్లు కూడా లేదని.. పెళ్లికి తీసుకున్న ఇల్లు.. అద్దె ఇల్లు అనే విషయం కూడా నర్మదకే తెలిసింది. వాళ్లు వేసుకునే ఖరీదైన బట్టలు కూడా అద్దెకి తెచ్చుకున్నారనే విషయం కూడా నర్మదకే తెలుసు. చందు.. శ్రీవల్లికి అప్పుగా ఇచ్చి పది లక్షల మ్యాటర్ గురించి కూడా నర్మదకే తెలుసు. వాళ్లు బస్తీలో చిన్న ఇంట్లో ఉంటున్నారనే విషయం కూడా నర్మద కంటే పడింది. ఇన్ని నిజాలు తెలిసిన తరువాత.. ఇప్పటి వరకూ రామరాజుకి చెప్పకుండా బిల్డప్‌లు కొడుతూ ఉంది. తీరా చెప్పేసమయం వచ్చేసరికి తాను చేతులు ఎత్తేయడమే కాకుండా.. ప్రేమ నోరు కూడా నొక్కేసింది. దీంతో ప్రేమకి బాగా మండింది. ‘‘నర్మద చేసిన పనికి హర్ట్ ప్రేమ.. జోరు వానలో కూర్చుని పళ్లు నూరుతూ ఉంటుంది. ఇంతలో బిల్డప్ రాణి నర్మద వస్తుంది. ప్రేమా.. ప్రేమా.. అని పిలుస్తుంది. ప్రేమ పలకకపోయేసరికి.. ఏంటి ప్రేమా వర్షంలో కూర్చుని ఉన్నావ్.. లోపలికి రా అని చేయి పట్టుకుంటుంది. దాంతో ప్రేమ.. పట్టించుకోకుండా నర్మద చేతిని విసిరికొడుతుంది. దాంతో నర్మద.. వెనుకే వచ్చి.. ‘నా చెల్లెలికి నాపై చాలా కోపం ఉందే... వల్లీ అక్క విషయం గురించేనా? అర్థం చేసుకోవాలి కదా.. ఆలోచించాలి కదా ప్రేమా’ అని అంటుంది. ఆ మాటతో ప్రేమ.. ‘ఏంటీ.. ఏంటీ అర్థం చేసుకునేదీ.. ఏంటి ఆలోచించేదీ.. ఆ వల్లీ ఎన్ని వేషాలు వేసింది. నిన్ను నన్నూ ఎంత టార్చర్ చేసింది. నేను ట్యూషన్ చెప్పడానికి వెళ్లిన విషయం ఇంట్లో చెప్పి ఎంత పెద్ద గొడవ క్రియేట్ చేసిందీ.. ఈ ఇంట్లో మనల్ని ఎవరూ లేని అనాథల్ని చేసింది. మర్చిపోయావా అక్కా..? అలాంటి వ్యక్తిని నువ్వు ఎలా క్షమించి వదిలేస్తావ్? అని దులిపేస్తుంది ప్రేమ. ఆ మాటతో నర్మద.. ‘నువ్వు చెప్పేది కరెక్టే కానీ.. అంటూ సాగదీస్తుంది. ‘కానీ లేదూ గీనీ లేదూ.. నువ్వు ఎంత చెప్పినా నేను వినను.. నువ్వు చేసింది నాకు నచ్చలేదు.. నువ్వు చేసిందే కాదు.. నువ్వు కూడా నాకు నచ్చడం లేదు. దయచేసి నువ్వు నాతో మాట్లాడొద్దు’ అంటూ నర్మదని దూరం పెట్టేస్తుంది ప్రేమ. ఇక రేపటి ఎపిసోడ్‌లో నర్మద బాగా వర్షంలో తడవడంతో పిల్లకి జలుబు చేసింది. దాంతో ధీరజ్.. ‘మనసు మరీ మత్తుగా తూలిపోతున్నదే.. ఏమో ఈ వేళ’ అంటూ తల తుడిచి ఆవిరిపడుతున్నాడు. ప్రేమకి జలుబు చేస్తే ఆమెకి ఆవిరిపడితే సరిపోతుంది కదా.. తనతో పాటు.. ధీరజ్‌ కూడా దుప్పట్లోకి దూరేస్తున్నాడు. ఆవిరి పట్టడానికండోయ్.