తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులకు శుభవార్త అందించింది. రెవెన్యూ శాఖలో అదనపు సిబ్బందిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 217 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలు పూర్తిగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయబడనున్నాయి. ఈ క్రమంలో అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం.. ఇటీవల ఏర్పాటు చేసిన 15 కొత్త రెవెన్యూ మండలాల్లో 189 పోస్టులు, అలాగే రెండు డివిజన్ల కోసం 28 పోస్టులు కలిపి మొత్తం 217 ఖాళీలను గుర్తించారు. ఈ నియామకాలు ముఖ్యంగా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉండగా.. భూ సంబంధిత కార్యకలాపాల వేగవంతమైన నిర్వహణకు వీటితో మేలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. గద్వాల, నల్గొండ, వికారాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి. దీని ఫలితంగా జిల్లాస్థాయి రెవెన్యూ వ్యవస్థలో సిబ్బంది కొరత తగ్గి.. ప్రజలకు అందే సేవలు మరింత వేగవంతమవుతాయి. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రభుత్వం ఒకదాని తరువాత ఒకటి కొత్త ఉద్యోగాలు ప్రకటిస్తూ ముందుకు వెళ్తుండటం అభ్యర్థులకు నమ్మకాన్ని కలిగిస్తోంది. మరోవైపు.. ఇప్పటికే అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు కూడా ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. కొత్తగా సిబ్బంది చేరడం వల్ల తమపై ఉన్న పనిభారం తగ్గుతుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఖాళీలను గుర్తించడమే కాకుండా.. నోటిఫికేషన్ త్వరగా వెలువడుతుందని సంకేతాలు రావడం నిరుద్యోగులకు పెద్ద ఊరటగా మారింది. ఈ నియామకాలు పూర్తి అయిన తర్వాత రెవెన్యూ శాఖ పనితీరు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే వివిధ శాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటికి సంబంధించి చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. గ్రూప్స్ ఉద్యోగాలతో పాటు.. పోలీస్, గురుకుల సంబంధిత ఉద్యోగ ఖాళీలను గుర్తించి.. వాటిని క్యాలెండర్ లో పొందుపర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.