పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు ముందే కచ్చితంగా తెలుసుకోండి

Wait 5 sec.

Bank Loan: ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల్లో లోన్ తీసుకోవడం చాలా సులభం అయిపోయింది. నిమిషాల వ్యవధిలోనే లోన్లు మంజూరవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ద్వారానే రుణాలు పొందవచ్చు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల తోపాటు లోన్ యాప్స్ రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. అయితే, పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్న వారు ముందే కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అధిక వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. ముఖ్యమైన 5 విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.లోన్ ఎక్కడ తీసుకుంటున్నాంలోన్ యాప్స్ వేధింపులతో బలవన్మరణానికి పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే లోన్ సులభంగా వస్తుంది కదా అని ఏ విషయాలు తెలుసుకోండిగా అడుగు వేయవద్దు. రుణదాత వివరాలు తెలుసుకోవాలి. సదరు ఆర్థిక సంస్థ కీర్తి ప్రతిష్టలు, చట్ట బద్ధత వంటివి తెలుసుకోవాలి. 15 నిమిషాల్లో లోన్ ఇస్తామని చెప్పే ప్లాట్ ఫామ్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. నమ్మకమైన బ్యాంకులు, కంపెనీల్లోనే లోన్ తీసుకోవడం మంచిది. ప్రాసెసింగ్ ఫీజుఇది 2-5 శాతం వరకు ఉండొచ్చు. లోన్ తీసుకునే ముందే ప్రాసెసింగ్ ఫీజు ఎంత అనేది తెలుసుకోవాలి. తక్కువ ప్రాసెసింగ్ ఫీజు ఉన్న బ్యాంక్, ఫైనాన్స్ సంస్థను ఎంపిక చేసుకుంటే ఆర్థిక భారం తగ్గుతుంది. స్థోమతకు మించి లోన్ తీసుకోవద్దుసులభంగా తిరిగి చెల్లించగలిగేంత మాత్రమే లోన్ తీసుకోవాలి. నెలవారీ ఈఎంఐ మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగా ఉండేలా చూసుకోవాలి. లోన్ ఇస్తున్నారని స్థోమతకు మించి తీసుకుంటే ఈఎంఐల భారం పెరిగి అప్పలు ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుంది. తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. వీలైనంత తక్కువ మొత్తంలో రుణాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి.హిడెన్ ఛార్జీలుహిడెన్ ఛార్జీలను వసూలు చేస్తుంటాయి. అందుకే లోన్ తీసుకునేముందే ఈ ఛార్జీల గురించి తెలుసుకోవాలి. ఇంతకు ముందు లోన్ తీసుకున్న వారిని అడిగి వివరాలు తెలుసుకోవడం మంచిది.వడ్డీ రేటురుణాల విషయంలో అత్యంత ముఖ్యమైన అంశం వడ్డీ రేటు. వడ్డీల భారం తగ్గాలంటే వడ్డీ రేటు తక్కువగా ఉండాలి. లోన్ తీసుకునే ముందే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు ఉందో తెలుసుకోవాలి. అవసరమైతే బ్యాంకు అధికారిక వెబ్ సైట్లలో వివరాలు తనిఖీ చేయాలి. బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకోవాలి.