ఏపీలో స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దసరా సెలవుల లిస్ట్ ఇదే, సెప్టెంబర్‌లో ఏకంగా 14 రోజులు సెలవులు!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎగిరి గంతేసేవార్త.. రాష్ట్రంలో విద్యా సంస్థలకు దసరా సెలవుల లిస్ట్ వచ్చేసింది. ఈ మేరకు ఈ ఏడాది విద్యా క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇలా ఉన్నాయి. ఏపీలో విద్యార్థులకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉంటాయి. అంటే విద్యార్థులకు మొత్తం 9 రోజుల పాటూ సెలవులు ఉన్నాయి. జూనియర్ కాలేజీలకు, క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు దసరా సెలవుల విషయానికి వస్తే.. విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇస్తారు. వీరికి మొత్తం 6 రోజులు దసరా సెలవులు ఉంటాయి. దసరా సెలవులు మాత్రమే కాదు.. సెప్టెంబర్ 6న మిలాడ్ ఉన్ నబీ.. సెప్టెంబర్ 7న ఆదివారం.. సెప్టెంబర్ 13న రెండో శనివారం, సెప్టెంబర్ 14న ఆదివారం, సెప్టెంబర్ 21న ఆదివారం కూడా సెలవు దినాలే. దసరా 9 రోజుల సెలవులకు తోడు ఈ ఐదు రోజుల కలిపితే విద్యార్థులకు సెప్టెంబర్‌లో దాదాపు రెండు వారాల పాటూ సెలవులు ఉన్నాయి. ఆగస్టు నెలలో కూడా విద్యార్థులకు వరుసగా సెలవులు వచ్చాయి. ఆ లిస్ట్ ఇలా ఉంది. 03-08-2025 ఆదివారం08-08-2025 వరలక్ష్మీ వ్రతం09-08-2025 రాఖీ పండగ, రెండవ శనివారం10-08-2025 ఆదివారం15-08-2025 స్వాతంత్ర్య దినోత్సవం16-08-2025 శ్రీకృష్ణాష్టమి17-08-2025 ఆదివారం24-08-2025 ఆదివారం27-08-2025 వినాయక చవితి31-08-2025 ఆదివారం తెలంగాణ విషయానికి వస్తే.. ఉన్నాయి. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ముఖ్యమైనది. తెలంగాణ‌లో ఒకేసారి బతుకమ్మ, దసరా పం డుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని స్కూల్స్‌, కాలేజీల‌కు సెలవులు ఇచ్చారు. మొత్తం మీద ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు వరుసగా సెలవుల మీద సెలవులు వచ్చాయి.