ఆంధ్రప్రదేశ్‌లో కాలేజీ విద్యార్థులకు ముఖ్యమైన గమనిక. 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి కాలేజ్ విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు అందరూ ఫీజు రీయింబర్స్‌మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులు ముందుగా వారి కాలేజీ ప్రిన్సిపల్ లాగిన్‌లో రిజిస్ట్రేషన్ & OTA ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రెండు పనులు పూర్తయిన తర్వాత మాత్రమే సచివాలయంలో వెరిఫికేషన్ కోసం వివరాలు చూపిస్తుంది. విద్యార్థుల వెరిఫికేషన్ కోసం కొన్ని డాక్కుమెంట్లు కావాలి.. వెరిఫికేషన్ ఫారం, విద్యార్థి ఆధార్ కార్డు, కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, రైస్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ (తల్లిది) కావాలి. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత గ్రామ/వార్డు సచివాలయం లో తప్పనిసరిగా FIVE STEP VERIFICATION WEA/WEDS LOGIN లో పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసిన విద్యార్థులకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ లభిస్తుంది. వెరిఫికేషన్ చేయనట్లయితే, విద్యార్థులు స్వయంగా కాలేజీకి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి అర్హులైన విద్యార్థులందరూ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నారు.కాలేజీలలో చదువుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం కాలేజీ ప్రిన్సిపల్ లాగిన్‌లో వారి పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చెయ్యాలి. సెకండియర్, థర్డ్, ఫోర్త్ ఇయర్ చదివేవారు గతేడాది నమోదు చేసిన వివరాలు వెరిఫై చేసుకొని సబ్మిట్ చేస్తే చాలు. కాలేజీలో ఫస్టియర్ చేరిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఆ కాలేజీలో సీటు పొందారు వాటి వివరాలు, ర్యాంకు కార్డు, క్యాస్ట్, ఇన్‌కమ్ వివరాలు ఇవ్వాలి. గతంలో పాసైన సర్టిఫికెట్లు, బదిలీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు రైస్ కార్డు లేదా రేషన్ కార్డు తల్లి, తండ్రి ఆధార్ కార్డు, తల్లి యొక్క బ్యాంకు అకౌంట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాలి. ఇప్పటికే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ చదివే విద్యార్థులు ఈ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ప్రిన్సిపల్ OTA ధ్రువీకరణ చేస్తారు. ఈ రెండు ప్రక్రియల తర్వాత విద్యార్థులు ఏ గ్రామ లేదా అవార్డు సచివాలయ పరిధికి వస్తారో.. ఆ గ్రామ, వార్డు సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ / వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వారి లాగిన్ కు వెరిఫికేషన్ కోసం వెళతాయి. అక్కడ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అధికారి వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. వెరిఫికేషన్‌కు అవసరమయ్యే డాక్యుమెంట్లను సచివాలయంలో సమర్పిస్తే సరిపోతుంది. సచివాలయంలో ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం.. ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.