: బంగారం కొనుగోలుదారులకు ధరల షాక్ తగులుతోంది. ఇటీవలి భారీగా దిగివచ్చిన మళ్లీ పెరుగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, భారత్‌పై ట్రంప్ అదనపు సుంకాలు అమలులోకి తేవడం వంటి పలు కారణాలు ఇన్వెస్టర్లను భయబ్రాంచులకు గురి చేస్తున్నాయి. దీంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారంలోకి మళ్లిస్తున్నారు. దీంతో ధరలు మళ్లీ వరుసగా పెరుగుతున్నాయి. అలాగే డాలర్ విలువ తగ్గుతుండడం బంగారం ధరల పెరిగేందుకు కారణణవుతోంది. అలాగే దేశీయంగా గమనిస్తే బంగారం ధర పెరిగేందుకు ప్రధానంగా పండుగల సీజన్ గిరాకీ అని చెప్పవచ్చు. వినాయక చవితి మొదలు దసరా, దీపావళి వరకు పండుగల వరుసగా వస్తాయి. ఈ క్రమంలో బంగారానికి మస్త్ డిమాండ్ ఉంటుంది. కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో ఆగస్టు 28వ తేదీన బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ స్వల్పంగా పెరిగాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు (31 గ్రాములు) 8 డాలర్లకు పైగా పెరిగి 3392 డాలర్ల వద్దకు చేరుకుంది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఇవాళ 0.40 శాతం పెరిగి 38.69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక ఇండియన్ కరెన్సీ రూపాయి మారకం విలువ అంతర్జాతీయంగా డాలర్‌తో పోలిస్తే రూ. 87.664 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో పెరిగిన బంగారం ధరభారత్‌పై అమెరికా విధించిన సుంకాలు అమలులోకి రావడం కారణంగా చెబుతున్నారు. ఈ క్రమంలో 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు ఇవాళ తులంపై రూ. 380 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేటు 1,02,440 వద్దకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ బంగారం రేటు ఇవాళ తులానికి రూ.350 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల రేటు రూ.93,900 వద్దకు చేరుకుంది. స్థిరంగానే వెండిబంగారం ధర పెరిగినప్పటికీ వెండి ఊరట కల్పించింది. రికార్డ్ స్థాయి నుంచి స్వల్పంగా తగ్గిన వెండి ఇవాళ అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,30,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది. అయితే, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఇప్పుడు కిలో వెండి రేటు రూ.1.20 లక్షల వద్ద ఉండడం గమనార్హం. పైన చెప్పిన బంగారం, వెండి రేట్లు ఆగస్టు 28వ తేదీన గురువారం ఉదయం 7 గంటలకు ఉన్నవి. మధ్యాహ్నానికి పసిడి ధరలు మారవచ్చు. కొనుగోలు చేసే ముందే తెలుసుకోవడం మంచిది. అలాగే జీఎస్టీ వంటి పన్నులు కలిపితే ధరల్లో చాలా వ్యత్యాసాలు ఉంటాయి.