: ప్రస్తుతం మన దేశంలో పండుగల సీజన్ మొదలైంది. వినాయక చవితి మొదలు కర్మ పూజ, ఓనమ్, ఈద్ ఇ మిలాద్, దసరా, దుర్గ పూజా సహా దీపావళి వరకు పండగలు వస్తుంటాయి. ఈ క్రమంలో వచ్చే సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల జాబితా ప్రకారం దేశవ్యాప్తంగా చూసుకుంటే బ్యాంకులకు దాదాపు 13 రోజుల పాటు సెలవులు ఉండడం గమనార్హం. సెప్టెంబర్ 3వ తేదీ బుధవారం: కర్మ పూజ సందర్భంగా జార్ఖండ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 4వ తేదీ గురువారం: ఫస్ట్ ఓనమ్ ఫెస్టవల్ సందర్భంగా కేరళలో బ్యాంకులకు హాలీడే ఇచ్చారు. సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం: ఈద్ ఇ మిలాద్, తిరువోన్నమ్ సందర్భంగా గుజరాత్, మిజోరాం, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్య ప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, హైదరాబాద్, విజయవాడ, మణిపూర్, జమ్ము, ఉత్తర్ ప్రదేశ్, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, జమ్మూ శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. సెప్టెంబర్ 6వ తేదీ శనివారం: ఈద్- ఇ మిలాద్, ఇంద్రజాత్ర సందర్భంగా సిక్కిం, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెప్టెండర్ 7వ తేదీ ఆదివారం: ఈరోజున దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం: ఈద్ ఇ మిలాద్ ఉల్ నబీ సందర్భంగా జమ్ము, శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. సెప్టెంబర్ 13వ తేదీ శనివారం: రెండో శనివారం సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి. సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం: బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ హాలీడే ఉంటుంది. సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం: నవరాత్రి స్థాపన సందర్బంగా రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం: మహరాజ్ హరి సింగ్ జీ జయంతి సందర్భంగా జమ్ము, శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 27వ తేదీ శనివారం: నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం: ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ చాలా లావాదేవీలు నిర్వహించవచ్చు. అయితే, చెక్కులు డిపాజిట్, డిమాండ్ డ్రాఫ్ట్స్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ వంటి ట్రాన్సాక్షన్లు చేసేందుకు తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. వారందరూ బ్యాంకు సెలవుల గురించి తెలుసుకోవడం అవసరం.