ఏపీలో రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. త్వరలోనే మరో అల్పపీడనం..

Wait 5 sec.

ఏపీవాసులకు అలర్ట్.. ఆదివారం కొన్ని జిల్లాల్లో . ఆదివారంర రోజున శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.మిగతా జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అంచనా వేశారు. వాయువ్య ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.మరోవైపు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో నదుల వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. ఈ విషయాన్నివెల్లడించింది. అయితే గోదావరి, కృష్ణా నదులలో వరద పూర్తిస్థాయిలో తగ్గేవరకు ఆయా నదీపరీవాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించింది. శనివారం రాత్రి 8 గంటల సమయానికి కాటన్ బ్యారేజి వద్ద ఇన్,ఔట్ ఫ్లో9.57 లక్షల క్యూసెక్కులు ఉందని తెలిపింది. వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుందని ఇప్పటికే మొదటి ప్రమాదహెచ్చరిక ఉపసంహరించినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. కృష్ణా నదిలో వరద ప్రస్తుతానికి నిలకడగా ఉందని, ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి హెచ్చరిక ఉపసంహరించినట్లు తెలిపారు.మరోవైపు వర్షాకాలంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాల వల్ల నీరు కలుషితం అయ్యే అవకాశం ఉందని.. దీనిని దృష్టిలో పెట్టుకుని నీటిని కాచి చల్లార్చి త్రాగాలని సూచిస్తున్నారు. తాజా వేడిగా ఉండే ఆహారం తీసుకోవాలని.. వీధిలో లభించే ఆహారాన్ని తినకుండా ఉంటే మంచిదని చెప్తున్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలని జాగ్రత్తలు చెప్తున్నారు. నీరు నిల్వ ఉంటే దోమలు విస్తరించే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఇక వర్షంలో వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రోడ్డుపై ఎక్కువ మొత్తంలో నీరు ఉంటే అటువైపుగా వాహనం నడపకపోవటం ఉత్తమమని సూచిస్తున్నారు. అలాగే పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని చెప్తున్నారు.