ఆస్పత్రి ఖర్చుల భయమే లేదు.. ఈ కేంద్రం స్కీంతో వారికి రూ. 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్!

Wait 5 sec.

: దేశంలో పేద, ధనిక అనే తేడా లేకుండా.. 70 సంవత్సరాలు పైబడిన వారికి ఏటా ఉచితంగా . ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం.. పీఎం జన్ ఆరోగ్య యోజన పథకం.. ఆయుష్మాన్ కార్డులు అందిస్తోంది. ఇందులో భాగంగా.. ఆస్పత్రిలో చేరినప్పుడు ఈ కార్డు ద్వారా రూ. 5 లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా ఎక్కడైనా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ లభిస్తుంది. ఈ స్కీం కోసం దరఖాస్తు చేసుకునేందుకు పీఎంజేఏవై, ఆయుష్మాన్ యాప్ అందుబాటులో ఉన్నాయి. చాలా మంది సరైన అవగాహన లేక.. ఇందులో చేరట్లేదని తెలుస్తోంది. మీ సేవా లేదా కామన్ సర్వీస్ కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ స్కీం పరిధిలో ఉన్నవారికి రూ. 5 లక్షల అదనపు కవరేజీ వస్తుంది. ఇక్కడ మీరు పీఎంజేఏవై పోర్టల్‌ అని గూగుల‌్‌లో సర్చ్ చేయాలి. . దానిపై క్లిక్ చేయాలి. కుడివైపున క్యాప్చా కోడ్, మీ ఫోన్ నంబర్, ఓటీపీ వంటివి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత KYC కోసం వివరాలు ఆధార్ వివరాలు ఎంటర్ చేసి.. ఆమోదం కోసం వెయిట్ చేయాలి. ఇంతకుముందే కేవైసీ అయ్యింటే.. ఆయుష్మాన్ వయ వందన కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి ఆదాయ వివరాలు, ఇతర డాక్యుమెంట్ల అవసరమే ఉండదు. పథకం కింద చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. . దీంట్లో 3 రోజుల పాటు ఉచితంగా ఆస్పత్రుల్లో చేర్చుకోవడం దగ్గర్నుంచి.. వైద్య చికిత్స, పరీక్షలు, ఐసీయూ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఫ్రీగానే మెడిసిన్, వసతి, పోషక ఆహారం కూడా లభిస్తాయి. ఈ ఆయుష్మాన్ కార్డులు ఉన్న వారికి.. దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకునేందుకు వీలు ఉంటుంది. అయితే రూ. 5 లక్షల పరిమితి మాత్రం వర్తిస్తుంది.ఇక.. ఈ వయసులో చికిత్స చేసి ఒకవేళ విఫలమైతే.. తమ హాస్పిటల్‌కు ఉన్న పేరు పోతుందనో, బిల్లుల కోసం చాలా రోజులు ఎదురుచూడాలనో.. ఇతర కారణాలతోనే కొన్ని ఆస్పత్రులు ఈ పథకం కింద ట్రీట్మెంట్ చేసేందుకు నిరాకరిస్తున్నాయి. అయితే ఇక్కడ చికిత్సకు నిరాకరిస్తే నేరుగా మీరే ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం ఒక పోర్టల్ కూడా అందుబాటులో ఉంది. . తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి.. ఏ పథకం కింద మీకు వైద్యం అందట్లేదని సెలక్ట్ చేసి.. ఫిర్యాదును నమోదు చేయాలి. ఇంకా 1800-11-4477 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేసేందుకు వీలుంది. ఇంకా ఉమంగ్ యాప్‌లో కూడా ఆయుష్మాన్ భారత్‌పై క్లిక్ కంప్లయింట్ రిజిస్టర్ చేయొచ్చు.