హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు చేపట్టిన సంబంధించి ఆరు రకాల అలైన్‌మెంట్‌లతో కూడిన నివేదికను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. ఈ నివేదికలో ప్రతిపాదిత మార్గాల స్వరూపం, నిర్మాణ వ్యయం, ప్రయాణ సమయం వంటి వివరాలను పొందుపరిచారు. ఈ ప్రతిపాదనలపై సెప్టెంబర్ మొదటి వారంలో కేంద్రం కీలక సమావేశం నిర్వహించనుంది.ప్రస్తుతం హైదరాబాద్ నుంచి హైదరాబాద్-శ్రీశైలం-నంద్యాల జాతీయ రహదారి. ఇది రిజర్వ్ ఫారెస్ట్ గుండా వెళ్తున్నందున రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రయాణాలకు అనుమతి లేదు. అంతేకాకుండా, వాహనాల వేగం గంటకు 30-40 కిలోమీటర్లకు పరిమితం కావడంతో భక్తులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు 55 కిలోమీటర్ల మేర కొత్త గ్రీన్‌ఫీల్డ్ రహదారిని నిర్మించాలని నిర్ణయించింది. ద్రానికి సమర్పించిన నివేదికలో ఆరు విభిన్న అలైన్‌మెంట్‌లను పొందుపరిచారు. ఇందులో రోప్‌వే, సొరంగ మార్గం, ఎలివేటెడ్ కారిడార్ వంటి పద్ధతులను ప్రతిపాదించారు.ఆరు అలైన్‌మెంట్ల వివరాలు:రోప్‌వే: ఈ మార్గం 15 మంది ప్రయాణికులతో 3 నుంచి 3.30 గంటల్లో గమ్యానికి చేరుస్తుంది. నిర్మాణ వ్యయం రూ. 4,213 కోట్లు.రోప్‌వే-రోడ్డు: 32.45 కి.మీ. రోప్‌వే, 7.70 కి.మీ. రోడ్డు మార్గంతో ప్రయాణ సమయం 4.30 గంటలు పడుతుంది. మొత్తం వ్యయం రూ. 3,954 కోట్లు.రోప్‌వే-ఎలివేటెడ్ కారిడార్-రోడ్డు: 9.4 కి.మీ. రోప్‌వే, 35.22 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్, 7.70 కి.మీ. రోడ్డుతో ఇది అత్యంత వేగవంతమైన మార్గం. ప్రయాణ సమయం 2.30 గంటలు. నిర్మాణ వ్యయం రూ. 5,645 కోట్లు.సొరంగ మార్గం (టన్నెల్): రెండు రకాల అలైన్‌మెంట్‌లు ఉన్నాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్ ద్వారా 40 కి.మీ. సొరంగం నిర్మాణానికి రూ. 29,000 కోట్లు, న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ విధానంలో 33 కి.మీ. సొరంగ నిర్మాణానికి రూ. 16,200 కోట్లు అవసరమవుతుంది.సొరంగం-ఎలివేటెడ్ కారిడార్-రోడ్డు: ఈ పద్ధతిలో నిర్మాణ వ్యయం ఎంచుకునే విధానాన్ని బట్టి రూ. 11,775 కోట్ల నుంచి రూ. 19,455 కోట్ల వరకు ఉంటుంది.ఎలివేటెడ్ కారిడార్: ఈ అలైన్‌మెంట్ నివేదికలో అత్యంత ఆమోదయోగ్యమైనదిగా పేర్కొన్నారు. 54.91 కి.మీ. మేర నిర్మించే ఈ నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌కు దాదాపు రూ. 7,668 కోట్లు ఖర్చవుతుంది. ఇది 24 గంటలు అందుబాటులో ఉండి, భారీ వాహనాలకు కూడా అనుకూలంగా ఉంటుంది.కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికను పరిశీలించి ఆమోదం తెలిపితే డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను వెంటనే ఖరారు చేసి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు ప్రారంభించవచ్చని అధికారులు తెలిపారు. ఈ మార్గం పూర్తయితే హైదరాబాద్ నుంచి శ్రీశైలం, ధ్రప్రదేశ్‌కు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. మార్గం మధ్యలో ఒక టోల్ ప్లాజా, రెండు బైపాస్‌లు, రెస్ట్ ఏరియాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (EPC) పద్ధతిలో చేపడితే లాభదాయకంగా ఉంటుందని నివేదికలో సూచించారు.