ఆంధ్రప్రదేశ్‌లో 'స్త్రీ శక్తి' పథకం కింద మహిళలకు ఉచిత బస్సు పథకం విజయవంతంగా అమలవుతోంది. ఈ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని మహిళలు బాగా ఉపయోగించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందట.. ఎంతమంది మహిళలు వచ్చినా ఇబ్బంది కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం జరిగిన సమీక్షలు ఆదేశించారు. 'స్త్రీ శక్తి' పథకం కింద 8,458 ఆర్టీసీ ఉందట.. ఈ పథకం వల్ల బస్సుల్లో రద్దీ పెరిగిందట. తో మహిళలు ఏమో కానీ పురుషులకు మాత్రం కష్టాలు మొదలయ్యాయి. పాపం మహిళల దెబ్బకు బస్సుల్లో పురుషులకు సీట్లు ఉండటంలేదంటూ మొరపెట్టుకుంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు భారీగా పెద్దఎత్తున ఆర్టీసీ బస్సులు ఎక్కేస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సు సర్వీసులు కిటకిటలాడుతున్నాయట. పలు జిల్లాల్లో ముఖ్యంగా పురుషులు, దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. అక్కడక్కడా తోపులాటలు కనిపిస్తున్నాయట.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం మంచి నిర్ణయమేనని.. కానీ పురుషులకు కూడా సీట్లు ఉంటే బావుంటుందనేది అభిప్రాయం. తమకు సీట్లు ఇవ్వడం లేదని పురుషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.. కొన్ని బస్సు సర్వీసుల్లో కనీసం నిల్చొనేందుకు కూడా వీలుండడం లేదంటున్నారు. ముఖ్యంగా పల్లెటూర్లకు సంబంధించి ఆర్టీసీ బస్సుల్లో ఈ సమస్య ఎదురవుతోందని చెబుతున్నారు.ఉదాహరణకు విజయనగరం జిల్లాలో రైతులు వ్యవసాయ పనుల కోసం, అమ్మకాల కోసం, వ్యక్తిగత పనుల కోసం చాలామంది వస్తున్నారు. దీంతో సాయంత్రం వరకు కాంప్లెక్సులోనే ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. కొన్ని రోజులుగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని.. దీంతో బస్సుల్లో సీట్లు దొరకడం కష్టంగా మారింది అంటున్నారు. కొన్ని పల్లెటూర్లకు ఒక్క బస్సే ఉంటోంది.. ఆ బస్సులో ఉచిత ప్రయాణం కోసం వచ్చిన మహిళలతో నిండిపోతోందంటున్నారు. అందుకే అదనపు సర్వీసులు నడపాలనే డిమాండ్ వినిపిస్తోంది. పురుషుల ఇబ్బందుల్ని కూడా గమనించి అదనపు సర్వీసులు నడపాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని బస్సుల్లో సీట్లు లేకపోయినా పర్లేదు.. నిలబడి ప్రయాణం చేయాలన్నా ఖాళీ ఉండటం లేదంటున్నారు. పురుషుల బాధను అర్థం చేసుకుని అదనంగా సర్వీసులు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయా అని అధికారులను అడిగారు. స్త్రీశక్తి పథకాన్ని మహిళలు బాగా వాడుకుంటున్నారన్నారు చంద్రబాబు. మహిళలు అవసరమైనప్పుడు మాత్రమే ప్రయాణిస్తున్నారు.. ఈ ఉచిత బస్సు పథకం విజయవంతం కావడానికి సహకరిస్తున్న మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే సహకరించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల సహకారం ఉంటే మరింత ఉత్సాహంగా పనిచేస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం ఇబ్బందులు, గందరగోళం వంటి ఘటనలు ఎక్కడా లేవన్నారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. గతంలో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య 40 శాతంగా ఉండేది.. ఇప్పుడు అది 65 శాతానికి పెరిగిందన్నారు. స్త్రీశక్తి పథకం బస్సులకు లైవ్ ట్రాకింగ్ విధానం తీసుకురావాలని సీఎం అడిగారు. గుంటూరు డిపోలో రెండు మూడు రోజుల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా లైవ్ ట్రాకింగ్ ప్రారంభిస్తామని ఎండీ తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు చేస్తామన్నారు.