ఏపీలో ఎమ్మెల్సీ రాజీనామా వ్యవహారం హైకోర్టుకు చేరింది. తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తాను గతేడాద నవంబర్ 23న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని.. ఈ మేరకు శాసనమండలి ఛైర్మన్‌కు లేఖ సమర్పించానని కోర్టుకు తెలిపారు. అయితే, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని హైకోర్టును ఆశ్రయించానన్నారు. చట్ట ప్రకారం తన రాజీనామాను ఆమోదించేలా ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్, మండలి ఛైర్మన్ నుంచి వివరాలు కోరారు. ఛైర్మన్ తరఫు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు ఈ వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ఈ అంశంంలో శాసనమమండలి ఛైర్మన్ నుంచి రాతపూర్వక వివరాలు తెప్పించాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన పార్టీని కూడా వీడారు. అయితే, తొమ్మిది నెలలు గడిచినా ఛైర్మన్ రాజీనామాను ఆమోదించకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 'నిర్ణయం తీసుకోవాల్సిన రాజ్యాంగ బాధ్యత మండలి ఛైర్మన్‌పై ఉంది.. ఏపీ శాసనసభ కార్యకలాపాల నిర్వహణ విధానంలోని నిబంధన 186, అధికరణ 190(3)బి ప్రకారం ఈ రాజీనామా లేఖపై తగిన ఉత్తర్వులిచ్చేలా ఆదేశించాలి' అని కోరారు. తన రాజీనామా లేఖపై తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గానికి చెందిన గత ఏడాది నవంబర్ 23న తన రాజీనామా లేఖను ఛైర్మన్‌కు అందజేశారు. జయమంగళ వెంకటరమణ టీడీపీలో పనిచేశారు.. 2024 ఎన్నికలకు ముందు ఆయన వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది.. కూటమి అధికారంలోకి రావడంతో జయమంగళ వెంకటరమణ రూటు మార్చారు. ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.. ఆ వెంటనే వెళ్లి జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.