ఏపీలో ఆ ప్రభుత్వ అధికారులకు ప్రమోషన్లు.. ఎన్నో ఏళ్ల కల నెరవేరింది

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్య విద్య, సెకండరీ హెల్త్, ప్రజారోగ్యం, ఔషధ నియంత్రణ శాఖల్లో 223 మంది వైద్యులు, అధికారులకు ప్రమోషన్లు కల్పించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (DPC) సిఫార్సులకు ఆమోదం తెలపాలని అధికారులను ఆదేశించింది. అలాగే, ఖాళీగా ఉన్న ఆరు ADME పోస్టులను కూడా భర్తీ చేయనుంది. ప్రొఫెసర్లుగా వీలుగా సర్వీసు నిబంధనలను ప్రభుత్వం సడలించింది. దీని ద్వారా 77 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందనున్నారు. అంతేకాకుండా, 110 మంది డిప్యూటీ సివిల్ సర్జన్లు/సివిల్ అసిస్టెంట్ సర్జన్లను సివిల్ సర్జన్ల స్పెషలిస్టులుగా ప్రమోషన్ దక్కనుంది.డ్రగ్ కంట్రోల్ విభాగంలో కూడా జరగనున్నాయి. నలుగురు అసిస్టెంట్ డైరెక్టర్లను డిప్యూటీ డైరెక్టర్లుగా, ఇద్దరు DD లను జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతి ఇవ్వనున్నారు. ఖాళీల భర్తీకి DPC సిఫార్సులకు ఆమోదం తెలపాలని సంబంధిత విభాగాధిపతులను ఆదేశించింది. ఆయుష్ విభాగంలో అదనపు సంచాలకుల పోస్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే ఆయుర్వేద విభాగంలో పదోన్నతులకు అవకాశం కల్పించింది. హెల్త్ డిస్ట్రిక్ట్ మాస్ ఎడ్యుకేషన్ మీడియా ఆఫీసర్లకు హెల్త్ ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లుగా పదోన్నతులు లభించాయి. స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసిన 12 మందికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజారోగ్య విభాగంలో డిప్యూటీ డైరెక్టర్లకు (డీడీ) పదోన్నతులు కల్పించారు. వీరందరికి చాలా కాలం తర్వాత ప్రమోషన్లు దక్కనున్నాయి. ఏపీ ప్రభుత్వం.. ఆయుష్ సంచాలకుల కార్యాలయంలో ఖాళీగా ఉన్న అదనపు సంచాలకుల (యునాని) పోస్టును భర్తీ చేయాలనే ప్రతిపాదనను అంగీకరించింది. ఆయుర్వేద విభాగంలో కూడా ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హెల్త్ డిస్ట్రిక్ట్ మాస్ ఎడ్యుకేషన్ మీడియా ఆఫీసర్లకు హెల్త్ ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లుగా పదోన్నతులు ఇవ్వడానికి స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసింది. ఆ సిఫార్సు చేసిన 12 మంది పేర్లను ప్రభుత్వం ఆమోదించింది. ప్రజారోగ్య విభాగంలో 22 ఏళ్లుగా డీడీలకు పదోన్నతులు లేవు. ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎనిమిది మంది డీడీలకు జాయింట్ డైరెక్టర్లుగా (జేడీ) ప్రమోషన్ దక్కింది. ఆరోగ్య శాఖలో పనిచేసే సిబ్బందికి పదోన్నతులు లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. అందుకే అదనంగా 6 జాయింట్ డైరెక్టర్ పోస్టులను సృష్టించాలని నిర్ణయించింది. ఖాళీగా ఉన్న అడిషనల్ డైరెక్టర్ల పోస్టులను జాయింట్ డైరెక్టర్లతో భర్తీ చేయనుంది. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీతో పాటూ ప్రమోషన్లు ఇస్తోంది.