మళ్లీ దిగొచ్చిన బంగారం ధరలు.. అక్కడ ఊహించని మార్పు.. తులం ఎంతుందంటే?

Wait 5 sec.

Gold Silver Rates: మరి అసలు రేట్లు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసా? కచ్చితంగా రేట్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. దాదాపు వరుసగా 15 రోజులు పసిడి ధర పతనం అయిన తర్వాత కిందటి రోజే (ఆగస్ట్ 22) మళ్లీ పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ మళ్లీ దిగొచ్చాయి. దేశీయంగా బంగారం రేట్లు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం భారీ షాక్ తగిలింది. వరుసగా తగ్గుతుంటే ఇంకా తగ్గుతాయనుకునేలోపు ఇక్కడ భారీగానే పెరిగాయి. దీంతో దేశీయంగా కూడా ఈ ధరల పెంపు ప్రభావం ఉదయం 10 గంటల తర్వాత కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3370 డాలర్ల మార్కుపైన ఉంది. కిందటి రోజు ఇది 3330 డాలర్ల వద్దే ఉండేది. ఒక్కరోజు వ్యవధిలో ఊహించని రీతిలో 40 డాలర్లకుపైగా పెరిగిందన్నమాట. ఇక సిల్వర్ ధర కూడా భారీగానే ఎగబాకింది. ఇది ప్రస్తుతం 38.89 డాలర్ల వద్ద ఉంది. మరోవైపు రూపాయి విలువ స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం డాలరుతో పోలిస్తే మారకం విలువ రూ. 87.30 వద్ద ఉంది. దేశీయంగా గోల్డ్ రేట్లు కిందటి రోజుతో చూస్తే తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 22 క్యారెట్స్ పుత్తడి ధర రూ. 150 తగ్గింది. దీంతో ఇప్పుడు తులం రూ. 92,150 వద్ద ఉంది. కిందటి రోజు చూస్తే ఇది రూ. 500 పెరిగింది. దానికి ముందు వరుసగా రూ. 550, రూ. 400, రూ. 100 ఇలా తగ్గాయి. ఇక 24 క్యారెట్లకు చెందిన ప్యూర్ గోల్డ్ రేటు 10 గ్రాములపై రూ. 220 తగ్గి ప్రస్తుతం రూ. 1,00,530 వద్ద ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్లు, 24 క్యారెట్ల పుత్తడి ధరలు వరుసగా రూ. 92300; రూ. 1,00,680 వద్ద కొనసాగుతున్నాయి.ఒక్కరోజులోనే రూ. 2000 పెరగడంతో హైదరాబాద్ నగరంలో కేజీకి ప్రస్తుతం రూ. 1.28 లక్షల వద్ద ఉంది. దీనికి ముందటి రోజు రూ. 1000 పెరిగింది. ఇక ఢిల్లీలో కూడా రూ. 2 వేలు పెరగ్గా ప్రస్తుతం కిలోకు రూ. 1.18 లక్షల వద్ద ఉంది.గోల్డ్ సిల్వర్ రేట్లు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయన్న సంగతి తెలిసిందే. స్థానిక పన్ను రేట్లతో పాటు మరికొన్ని అంశాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణం అవుతుంటాయి. ఈ కారణంతోనే బంగారం ధర హైదరాబాద్ కంటే ఢిల్లీలో కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో వెండి రేటు హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటుంది.