ఏపీ ఉచిత బస్సు పథకం.. అప్పుడే మొదలైందా, అయ్యో పాపం మగవాళ్లు.. ప్రారంభమైన వారానికే ఇదేందయ్యా

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం స్త్రీ శక్తి పథకం కింద తీసుకొచ్చిన బస్సులో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పథకం ప్రారంభమైన మొదటి వారంలోనే 1.04 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. స్త్రీ శక్తి పథకం అమలవుతున్న పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మొత్తం 2.21 కోట్ల మంది ప్రయాణించారు. అయితే వీరిలో మహిళలు 1.04 కోట్లు ఉన్నారు.. అయితే ఈ బస్సుల్లో టికెట్లు తీసుకుని ప్రయాణించిన పురుషుల సంఖ్య 1.17 కోట్ల మంది ఉన్నారు.. గతంతో పోలిస్తే మగవారి సంఖ్య తగ్గింది అంటున్నారు. ఈ వారంలో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు రూ.41.22 కోట్ల మేర లబ్ధి కలిగింది. మొదలయ్యాక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్యలో మార్పు వచ్చింది. గతంలో పురుషులు ఎక్కువగా ఉండేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మహిళా ప్రయాణికులు పెరిగారు.. పురుష ప్రయాణికులు తగ్గారు. గతంలో 60 శాతం పురుషులు, 40 శాతం మహిళలు ఉండేవారు. ఇప్పుడు మహిళలు 60 శాతానికి పెరిగారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. స్త్రీశక్తి పథకం రాకతో ఐదు రకాల బస్సుల్లో ఈ మార్పు కనిపిస్తోంది. ఆర్టీసీ అధికారులు పురుషుల సంఖ్య 33 శాతానికి తగ్గుతుందని.. మహిళల సంఖ్య 67 శాతానికి పెరుగుతుందని ముందుగానే ఒక అంచనా వేశారు. ఆర్టీసీ అధికారుల అంచనాలు నిజం అయ్యాయి.. స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చాక మహిళా ప్రయాణికులు 60 శాతానికి పెరిగారు.రాష్ట్రంలో మహిళల కోసంమంచి స్పందన పొందుతోంది. ఈ పథకాన్ని చాలా మంది మహిళలు ఉపయోగిస్తున్నారు. పల్లె వెలుగు బస్సులకు ఏసీ బస్సులు పెడతామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. అంతేకాదు, కొత్తగా 1,150 ఎలక్ట్రికల్ బస్సులు కొంటామని ఆయన అన్నారు. కొత్త ఎలక్ట్రికల్ బస్సులను డిపోలలో బాగా చూసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమలరావు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి భద్రాచలానికి వెళ్లే మరిన్ని ఆర్టీసీ బస్సులకు వర్తిస్తుంది. మొత్తం తొమ్మిది బస్సులకు ఈ పథకం వర్తిస్తుందని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మహిళా ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది. రాజమహేంద్రవరం, గోకవరం డిపోల నుంచి మారేడుమిల్లి మీదుగా భద్రాచలం వెళ్లే ఏడు బస్సులను ఎటపాక వరకు పొడిగించారు. రాజమహేంద్రవరం డిపో నుంచి కుక్కునూరు మీదుగా భద్రాచలం వెళ్లే మరో తొమ్మిది ఎక్స్‌ప్రెస్ బస్సులకు ఈ పథకం అమలు చేస్తారు. ఈ నిర్ణయంతో భద్రాచలంతోపాటు ముంపు మండలాలకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే మహిళలకు మేలు జరుగుతుంది.