Multibagger: స్మాల్ క్యాప్ కేటగిరీలోని ఈవీ టెక్నాలజీ సెక్టార్‌కు చెందిన ప్రముఖ కంపెనీ మెర్క్యూరీ ఈవీ టెక్ లిమిటెడ్ () అదరగొట్టింది. భారత్‌పై ట్రంప్ సుంకాల అమలుతో దేశీయ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సమయంలో ఈ కంపెనీ స్టాక్ దూసుకెళ్తోంది. ఇవాళ్టి స్టాక్ మార్కెట్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఆరంభంలోనే 5 శాతం మేర పెరిగి అప్పర్ సర్క్యూట్ టచ్ చేసింది. దీంతో ఆగస్టు 28వ తేదీన మెర్క్యూరీ ఈవీ టెక్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.980 కోట్ల పైకి చేరుకుంది. ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించిన తొలి త్రైమాసిక ఫలితాలను ఇటీవలే ప్రకటించగా అందులో కంపెనీ రెవెన్యూ రూ.23.07 కోట్లుగా నమోదు చేసింది. అలాగే కంపెనీ నెట్ ప్రాఫిట్ రూ.1.63 కోట్లకు చేరింది. EBITD రూ. 2.62 కోట్లుగా వెల్లడించింది. ఈ పాజిటివ్ సంకేతాల నేపథ్యంలో ఈ స్టాక్ రాణిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గత వారంలో ఈ స్టాక్ 1.09 శాతం మేర నష్టపోయింది. అలాగే గత మూడు నెలల్లోనే 16.17 శాతం పడిపోయింది. గత ఏడాది కాలంలో చూస్తే 31.66 శాతం నష్టపోయింది. కంపెనీ వృద్ధి పథంలో ఉందని ఇటీవలే పలు నివేదికలు వెల్లడించాయి. కంపెనీ ఏడాది నెట్ సేల్స్ 123.69 శాతం పెరిగినట్లు తెలిపాయి. దీంతో ఆపరేటింగ్ ప్రాఫిట్ 84.22 శాతం వృద్ధి సాధించింది. గత 6 నెలల డేటా చూస్తే నెట్ సేల్స్ రూ.53.25 కోట్లుగా ఉన్నాయి. కంపెనీ 464.09 శాతం మేర వృద్ధి నమోదు చేసినట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 390 శాతం పెరిగి రూ.3.53 కోట్లకు చేరుకుంది. EBITDAలో దీని వాటా 9.32 రెట్లుగా ఉంది. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో రూ.48.50 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టింది. ఆ తర్వాత 5 శాతం మేర పెరిగి రూ.51.95 స్థాయిని తాకింది. అలాగే ఈ స్టాక్ గత 5 సంవత్సరాల కాలంలో ఏకంగా 8600 శాతం మేర పెరిగి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది. లక్ష రూపాయలు పెట్టిన వారికి ఏకంగా రూ.86 లక్షలకు పైగా అందించింది.