అగ్నిపరీక్ష అంటూ కొత్త ప్రక్రియని బిగ్‌బాస్ టీమ్ తీసుకొచ్చింది. సీజన్-9కి కామనర్స్‌ని పంపించేందుకు ఏర్పాటు చేసిన సెలక్షన్ ప్రక్రియే అగ్నిపరీక్ష. అయితే ఈ సెలక్షన్ కోసం జ్యూరీగా పెట్టిన . దీనికి కారణాలు లేకపోలేదు. చిత్ర విచిత్రమైన సెలక్షన్ ప్రాసెస్, టాస్కులతో కంటెస్టెంట్లకి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా వీళ్లు మాట్లాడుతున్నారు. ఇక యాంకర్‌గా ఉన్న శ్రీముఖి కూడా తక్కువేం తినలేదు. అగ్నిపరీక్ష లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఒక లేడీ కంటెస్టెంట్‌ని అటు శ్రీముఖి ఇటు నవదీప్ ఇద్దరూ ఘోరంగా అవమానించారు. ఇప్పటివరకూ టాప్-15 కోసం ఆరుగుర్ని సెలక్ట్ చేసింది జ్యూరీ. ఇక హోల్డ్‌లో పెట్టిన 16 మంది నుంచి మరో 9 మందిని సెలక్ట్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈరోజు వారికి కొన్ని టాస్కులు పెట్టారు. ఏదో దొరికిందే ఛాన్స్ అన్నట్లు తమ రాక్షసత్వం మొత్తాన్ని వాళ్ల మీద చూపించినట్లుగా ఈ టాస్కులు ఉన్నాయి. అయితే ఇందులో ఒక టాస్కు విషయంలో కంటెస్టెంట్ దమ్ము శ్రీజ-నవదీప్ మధ్య చిన్న డిస్కషన్ జరిగింది.కల్కి- షాకీబ్ ఇద్దరికీ శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. ఇందులో భాగంగా తమ ఫోన్ నుంచి ఎవరో ఒకరికి కాల్ చేసి ఎలాంటి కారణాలు చెప్పకుండా అర్జెంటుగా డబ్బులు పంపమని అడగాలి. ఇద్దరిలో ఎవరు ఎక్కువ డబ్బులు తమ అకౌంట్లో వేయించుకుంటారో వాళ్లు విన్నర్ అని శ్రీముఖి టాస్క్ పెట్టింది. అయితే ఈ రూల్స్ చెప్పేటప్పుడు ఒకర్ని స్టూడియో బయటికి వెళ్లమని చెప్పింది. ఎందుకంటే వాళ్లు ఫోన్‌లో అమౌంట్ నంబర్ చెబితే మరో కంటెస్టెంట్‌కి తెలిసిపోతుందని ఇలా చేసింది. దీంతో షాకీబ్ స్టూడియో బయటికి వెళ్లాడు.ఇక కల్కి ముందుగా ఫోన్ చేసి తన ఫ్రెండ్‌తో 90 వేలు అర్జెంటుగా ట్రాన్స్‌‌ఫర్ చేయమని చెప్పింది. మరోవైపు షాకీబ్.. కల్కి ఎంత నంబర్ చెప్పిందో తెలీక.. ఫ్రెండ్‌కి కాల్ చేసి 10 వేలు కొట్టమని అడిగాడు. దీంతో శ్రీముఖి మరో అవకాశం ఇచ్చింది. షాకీబ్ ఈ సారి తన చెల్లికి ఫోన్ చేసి ఎంత వీలైతే అంత ఎక్కువ అమౌంట్ సెండ్ చేయమని చెప్పాడు. ఆమె 50 వేలు పంపింది. దీంతో కల్కి 90 వేలు అకౌంట్‌లో పడేలా మాట్లాడింది కాబట్టి విన్నర్ అయింది.అయితే ఈ టాస్కుపై షాకీబ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. నంబర్ గేమ్ అని ముందే చెప్తే బావుండేది అన్నాడు. ఇద్దరికీ ఒకే రూల్స్ ఇచ్చాం.. అంటూ శ్రీముఖి అంది. అయినా కానీ ఎందుకులే అని ఈ టాస్క్ అన్‌ ఫెయిర్‌గా జరిగిందని అనిపిస్తుందా.. అని శ్రీముఖి అక్కడున్నమిగిలిన కంటెస్టెంట్లని అడిగింది. వాళ్లలో దమ్ము శ్రీజ మాత్రం చేయి ఎత్తింది. దీనికి ఆన్సర్ ఇవ్వకుండా అయితే నువ్వు కూసో అట్లనే.. అంటూ శ్రీముఖి ఆమెని ఎగతాళి చేసింది.ఊపుకుంటూ వచ్చేసిఆ తర్వాత నవదీప్.. షాకీబ్, శ్రీజ ఇద్దరినీ స్టేజ్ మీదకి పిలిచాడు. అన్‌ఫెయిర్‌గా జరిగిందని నువ్వు ఫీల్ అయ్యావా.. అని షాకీబ్‌ని అడిగితే కాస్త కన్ఫ్యూజ్ అయ్యానని ఆన్సర్ ఇచ్చాడు. కన్ఫ్యూజ్ అయ్యా అన్నావుగా పోయి కూర్చో.. అంటూ నవదీప్ అన్నాడు. ఆ తర్వాత శ్రీజని మాత్రం స్టేజ్ మీద ఉంచి నవదీప్ కాస్త ఎక్కువే మాట్లాడాడు. అన్‌ఫెయిర్ అనగానే చేయి ఎత్తావు కదా.. నీ ఫీలింగ్ ఏంటి.. అని అడిగాడు. అంటే టాస్క్ గురించి షాకీబ్‌‌‌కి క్లియర్‌‌గా చెప్పలేదని శ్రీజ అంది. దీనికి అతనికి ఎందుకు చెప్పాలి టాస్క్ ఈమెకి కదా.. అంటూ నవదీప్ వాదించాడు.ఫస్ట్ కల్కికి క్లియర్‌గా ఎక్స్‌ప్లయిన్ చేశారు 1 రూపాయి కన్నా ఎక్కువ ఉన్నా సరే నువ్వు విన్ అవుతావని చెప్పారు.. అక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లయిన్ చేసినట్లు ఉంది.. షాకీబ్ కన్ఫ్యూజ్‌ అయ్యాడు ఎందుకంటే.. అని శ్రీజ చెప్పబోతుంటే "ఎవరి తప్పమ్మా.. పక్కనవాడి కంటే ఎక్కువ ఉండాలని చెప్పినా.. చెప్పకపోయినా పక్కనవాడు ఎంత అడుగుతాడో మనకి తెలీదు కదా.. సో ఆమెకి అది అర్థమైంది.. ర్యాండమ్‌గా ఒక నంబర్ అనుకుంది.. అతను కన్ఫ్యూజ్ అయితే మళ్లీ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు..ఇచ్చిన తర్వాత నేను చెప్పాను బై మిస్టేక్.. మేక్సిమమ్ ఉండాలని నేను చెప్పాను.. అతను ఆడాడు.. ఇక్కడ నీకు ఇచ్చే సలహా ఏంటంటే అతిగా ఆలోచించకు.. బిగ్‌బాస్ వందల ఎపిసోడ్లు వందల భాషల్లో చేశారు.. నువ్వు ఊపుకుంటా ఊరి నుంచి వచ్చి ఇది అన్‌ఫెయిర్ అని చెప్పడానికి నీకు అంత సీన్ లేదు.. ఇంకొకసారి ఇలా చేయకు.. నేను అయితే సరదాగా చెప్పి పంపిస్తా కానీ.. తర్వాత నీకే చాలా డ్యామేజ్ అవుతుంది.." అంటూ నవదీప్ సీరియస్ అయ్యాడు. దీనికి శ్రీజ ఏదో చెప్పబోతే నేను చెప్పాల్సింది అయిపోయింది నువ్వెళ్లి కూర్చో పో.. అయిపోయింది పో నేను చెప్పాల్సింది చెప్పాను.. అంటూ నవదీప్ అన్నాడు. మరి ఇక్కడికి పిలవడం దేనికి.. అని శ్రీజ అభ్యంతరం చెప్పింది. అంటే సెంటర్‌కి వస్తే అందరికీ అర్థమవుతుంది.. కదా.. అని పిలిచా చాలా అంటూ నవదీప్ అన్నాడు.ఇలా శ్రీజపై నవదీప్ అంతగా ఫైర్ అవ్వాల్సిన అవసరం ఏముందో అతనికే తెలియాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆడవాళ్లని ఏమైనా అంటే సర్రున లేచిపోయే ఆడ పులి బింధు మాధవి.. నవదీప్ పక్కనే కూర్చొని ఉంది. కానీ అలా అనడం తప్పని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇక అభిజిత్ కూడా ఏం రియాక్ట్ కాలేదు.