: వాహనదారులకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. . వీటిని జనం అట్టిపెట్టుకోకుండా ఉండేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న కేంద్రం.. తాజాగా పరోక్షంగా కీలక నిర్ణయం తీసుకుంది. 20 సంవత్సరాలకు మించి వినియోగంలో ఉన్న వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) రెనివల్ రుసుముల్ని పెంచేసింది. ఇక్కడ దాదాపు రెట్టింపు చేయడం గమనార్హం. అంటే రూ. 1000 ఉంటే రూ. 2 వేలు, రూ. 500 ఉంటే రూ. 1000 ఇలా పెంచుతున్నట్లు వెల్లడించింది. చేసింది. గతంలో మోటార్ వాహనాల నిబంధనల్లో రూల్ 81-4 B కింద ఒక్క ఆర్‌సీ రెనివల్‌కు మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు కొత్తగా రూల్ 81 కింద కొత్తగా 4C క్లాజ్‌ను యాడ్ చేసి దాంట్లో 20 ఏళ్లకు మించిన వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రెనివల్‌కు అవకాశం కల్పించారు. అయితే ఇక్కడ ఛార్జీలపై జీఎస్టీ అదనంగా ఉంటుంది. >> కొత్త నిబంధనల ప్రకారం.. 20 ఏళ్లకుపైగా వినియోగంలో ఉన్న మోటార్ సైకిల్స్‌కు ఆర్‌సీ రెనివల్ రుసుముల్ని రూ. 2 వేలకు పెంచింది. త్రీ వీలర్, 4 వీలర్ వాహనాలకు రూ. 5 వేలకు పెంచారు. దిగుమతి చేసుకున్న టూ వీలర్, త్రీ వీలర్ వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఫీజును రూ. 10 వేల నుంచి ఒకేసారి రూ. 20 వేలకు పెంచేశారు. 4 లేదా అంతకుమించి చక్రాల వాహనాలకు దిగుమతి చేసుకున్నవాటికి రూ. 40 వేల నుంచి రెట్టింపు చేసి రూ. 80 వేలకు చేర్చారు. 2, 3, 4 వీలర్ కాకుండా మిగతా వాహనాలకు చూస్తే రూ. 6 వేల నుంచి ఒకేసారి రూ. 12 వేలకు పెంచేశారు. >> మోటార్ సైకిళ్లకు ఊహించని రీతిలో గతంలో రూ. 100గానే ఉండగా.. ఇప్పుడు 20 రెట్లు పెంచేసి దీనిని రూ. 2 వేలకు చేర్చింది. తేలికపాటి మోటార్ వాహనాలకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచేసింది. అయితే ఈ రూల్ దేశ రాజధాని ఢిల్లీలో వర్తించదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అక్కడ 15 సంవత్సరాలకు మించి వినియోగంలో ఉన్న వాహనాలపై నిషేధం అమల్లో ఉంది. అవి రోడ్లపైకి వచ్చేందుకే అనుమతి లేదన్నమాట.ఇప్పుడు మిగతా చోట్ల 20 ఏళ్లకుపైగా వినియోగంలో ఉన్నటువంటి వాహనాలకు రోడ్ల మీదికి వచ్చేందుకు అనుమతి ఉన్నప్పటికీ.. రెనివల్ చేసుకోవాలంటేనే కష్టంగా మారింది. అంతపెట్టి రెనివల్ చేసుకునే బదులు.. కొత్త వాహనాల కొనుగోలు వైపు మొగ్గుచూపిస్తారనేది కేంద్రం అంచనాగా ఉంది.