పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా క్షణాల్లో తెలుసుకోవచ్చు.. ఒక్క నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు..!

Wait 5 sec.

: ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొప్ప సామాజిక, భద్రతా పథకాల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది రిటైర్మెంట్ ప్రయోజనాల్ని అందించే ఉద్దేశ్యంతో తీసుకొచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ () దీనిని నిర్వహిస్తుంటుంది. ఇక ఇందులో మన వేతనం నుంచి కంపెనీ ప్రతి నెలా 12 శాతం కట్ చేసి పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తుంటుంది. ఇంకా కంపెనీ కూడా అంతే మొత్తం యాడ్ చేయాలి. ఇక్కడ 3 శాతానికిపైగానే పీఎఫ్ ఖాతాలోకి వెళ్తే.. మిగతా మొత్తం పెన్షన్ స్కీంలోకి వెళ్తుంది. .అయితే పీఎఫ్ నిధుల్ని వరుసగా 2 నెలలు ఉద్యోగం లేకపోతే లేదా రిటైర్మెంట్ తర్వాత పూర్తిగా తీసుకోవచ్చు. అయితే మధ్యలో కూడా సదుపాయం ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు తరచుగా తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే కంపెనీ పీఎఫ్ నిధుల్ని మీ అకౌంట్లో ప్రతి నెలా జమ చేస్తుందా లేదా? కేంద్రం వడ్డీ వేస్తుందా లేదా అనేది తెలుసుకోవచ్చు.పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు చాలానే ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ అన్నింటికంటే సులభం మిస్డ్ కాల్ సర్వీస్. ఇక్కడ ఈపీఎఫ్ఓ యూఏఎన్‌కు మీ మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. కేవైసీ కూడా సరిగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్ సీడింగ్ అయి ఉండాలి. అప్పుడు 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. క్షణాల్లో మీ పీఎఫ్ లాస్ట్ కాంట్రిబ్యూషన్స్, బ్యాలెన్స్ వివరాలు ఫోన్‌కు మెసేజ్ రూపంలో వస్తాయి. దీనికి ఎలాంటి రుసుమూ ఉండదని గుర్తుంచుకోవాలి. కాల్ చేయగానే 2 రింగ్స్ తర్వాత కట్ అయి.. మెసేజ్ వస్తుంది.>> ఎస్ఎంఎస్ సర్వీస్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే వీలుంటుంది. ఇక్కడ 773829899 నంబర్‌కు మీ యూఏఎన్‌కు లింక్ అయిన నంబర్ నుంచి EPFOHO UAN అని మెసేజ్ చేయాలి. UAN అంటే UAN నంబర్. >> ఉమంగ్ యాప్‌లో కూడా ఈపీఎఫ్ఓ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ కూడా పీఎఫ్ సర్వీసెస్ దగ్గర సింపుల్‌గా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. >> ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి ఎంప్లాయీస్ సర్వీసెస్, మెంబర్ పాస్‌బుక్‌కు వెళ్లి పీఎఫ్ బ్యాలెన్స్ వివరాల్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ మీ యూఏఎన్, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ కావాలి. యూఏఎన్ లేకుంటే Know Your UAN అని క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇక్కడ పీఎఫ్ బ్యాలెన్స్ పూర్తి వివరాలు.. ఏ ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉన్నాయి.. వడ్డీ ఎంత జమైంది ఇలా అన్నీ తెలుసుకోవచ్చు.