సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ వస్తారు పోతారు నాకు మాత్రం అదే ముఖ్యం.. చిరంజీవి

Wait 5 sec.

ఈటీవీ 30 ఇయర్స్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ గెస్టుగా రావడమే కాకుండా స్టేజ్ మీద స్టెప్పులేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఇక ఈ ఈవెంట్‌లో బాస్ ఇచ్చిన స్పీచ్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తనకి స్టేచర్, ట్యాగ్‌లు ముఖ్యం కాదని మంచి మనిషి అనిపించుకోవడమే ప్రధానం అంటూ చిరు అన్నారు."సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ వస్తారు పోతారు.. ఎవరు చూడలేదు ఈ ఫిలిం ఇండస్ట్రీ.. ఎవరు చూడలేదు ఈ ప్రేక్షకులు.. కానీ నిరంతరం మంచి వ్యక్తి, మంచి మనిషి అనిపించుకోవడం నాకు ప్రధానం తప్ప.. ఇవన్నీ శాశ్వతం కాదు.. ఇక్కడికి వచ్చేసరికి నా ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ లాగ అనిపించింది.. ఎలాంటి స్టార్ ఇమేజ్ పెట్టుకోకుండా మీతో పాటు ఇలా డ్యాన్స్ చేయగలిగానంటే అది వాళ్లు ఇచ్చిన కంఫర్ట్.. వాళ్లు చూపించిన అభిమానం, ప్రేమ.. అందుకే నన్ను నేను మర్చిపోయి నా ఇంట్లో నా బెడ్ రూమ్‌లో నా హాల్లో డ్యాన్స్ చేస్తున్నట్లు వేసేస్తున్నానంటే కనుక నాకు ఎలాంటి లేయర్లు, మొహమాటాలు ఏం లేవు.. అంతటి కంఫర్ట్ నాకు ఈ ఫ్యామిలీ ఇచ్చింది." అంటూ చిరంజీవి అన్నారు.ఏనాడూ నేను చూడలేదుఇదే ఈవెంట్‌లో దర్శకుడు కే రాఘవేంద్ర రావు.. చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేను చిరంజీవిని ప్రేమగా బాబాయ్ అని పిలుచుకుంటాను.. నేను మేక్సిమమ్ సినిమాలు రామారావు గారి కన్నా రెండు మూడు సినిమాలు ఎక్కువ ఈయనతోనే చేశాను.. మా బాబాయ్ ఎంతపెద్ద స్టార్ అయినా కూడా ఈయన దగ్గరినుంచి కూడా చాలా నేర్చుకోవాలి.. సింప్లిసిటీ.. ఈ స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయాల్సిన అవసరం ఆయనికి లేదు.. బ్లడ్ బ్యాంక్ పెట్టడం కానీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అందరికీ హెల్ప్ చేయడం కానీ.. చిన్నా పెద్దా లేకుండా ఏనాడు నేను పెద్దవాడ్ని అనుకోలేదు.. నా కుటుంబానికి వాళ్ల కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది.. ఇలాంటి గ్రేట్ పీపుల్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది అంటూ రాఘవేంద్ర రావు అన్నారు.ఇక ఈ ఈవెంట్‌లో , డ్యాన్స్ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కెరీర్ విషయానికొస్తే చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సమ్మర్‌కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. అలానే అనిల్ రావిపూడితో చిరంజీవి చేస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలోకి దిగుతుంది. ఇటీవల రిలీజైన భారీ రెస్పాన్స్ వచ్చిది. మా శంకరవరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు అంటూ పెట్టిన టైటిల్ కూడా ఫ్యాన్స్‌కి బాగా నచ్చింది.