గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఈరోజు హైదరాబాద్‌లో తులం రేటు ఎంతకు దిగొచ్చిదంటే?

Wait 5 sec.

: భారతీయుల జీవిన విధానంలో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎంత పేద వారైనా తమ వద్ద ఎంతో కొంత బంగారం ఉండాలనుకుంటారు. తమ స్థోమత ప్రకారం కొనుగోలు చేస్తారు. ఇక పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్ల సమయాల్లో బంగారం కచ్చితంగా ఉండాల్సిందే. ముఖ్యంగా మహిళలు పసిడి ఆభరణాలు ధరించేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ప్రత్యేక సీజన్లలో బంగారానికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ దసరా, దీపావళికి బంగారం కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తారు. ఈ రెండు సీజన్లు బులియన్ మార్కెట్లో ప్రధానంగా కనిపిస్తాయి. ఇప్పుడు దసరా సమీపిస్తోంది. ఇలాంటి సమయంలో వరుసగా దిగివస్తుండడం కొనుగోలుదారులను ప్రోత్సహిస్తుందని, ఎక్కువ కొనేలా మొగ్గు చూపేందుకు అవకాశం కల్పిస్తుందని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1.25 డాలర్లు పెరిగి 3373 డాలర్ల పైకి ఎగబాకింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు మాత్రం కాస్త తగ్గింది. ప్రస్తుతం సిల్వర్ ధర ఔన్సుకు 0.19 డాలర్లు తగ్గి 38.70 డాలర్ల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరహైదరాబాద్ బులియన్ మార్కెట్లో మరింత తగ్గాయి. రెండ్రోజుల క్రితం ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగించినా మళ్లీ దిగివస్తుండడం మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఇవాళ 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై రూ.100 తగ్గింది. దీంతో తులం రేటు రూ.93,050 వద్దకు దిగివచ్చింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.110 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ. 1,01,510 వద్దకు తగ్గింది. రూ.1000 పెరిగిన వెండిసరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశీయ మార్కెట్లో వెండి రేటు ఇవాళ మరో రూ.1000 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.1,31,000 మార్క్ దాటింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,21,000 వద్ద కొనసాగుతోంది. ముందు ముందు మరింత పెగవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కథనంలో చెప్పిన బంగారం, వెండి రేట్లు ఆగస్టు 26వ తేదీ మంగళవారం రోజు ఉదయం 7 గంటలకు ఉన్నవి. అయితే, మధ్యాహ్నానికి పసిడి ధరలు మారుతుంటాయి. గోల్డ్ రేట్లు ప్రాంతాలను బట్టి వేరు వేరుగా ఉంటాయి. కొనే ముందు మీ ప్రాంతంలో ఉన్న రేట్లు తెలుసుకోవడం మంచిది.