పెళ్లికి రెడీ అయిన నివేదా పేతురాజ్.. సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్.. వరుడు ఎవరంటే?

Wait 5 sec.

టాలీవుడ్ హీరోయిన్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. తనకు కాబోయే భర్తని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. ఇప్పటికే తనకు ఎంగేజ్‌మెంట్ జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ ఓ ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దుబాయ్ కి చెందిన రాజ్‌హిత్ ఇబ్రాన్‌ అనే వ్యాపారవేత్తను నివేదా పేతురాజ్ పెళ్లి చేసుకోనున్నారు. ఈ ఏడాది చివర్లో వీరి వివాహ వేడుక జరగనుందని వార్తలు వస్తున్నాయి. నిరాడంబరంగా, కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో వెడ్డింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే వెలువడతాయని అంచనా వేస్తున్నారు. నివేదా పేతురాజ్ పెళ్లి చేసుకోనున్నారనే వార్త తెలియగానే అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.'ఒరు నాల్ కూతు' అనే తమిళ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నివేదా పేతురాజ్.. 'మెంటల్ మదిలో' చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె 'చిత్రలహరి', 'బ్రోచేవారెవరురా', 'అల వైకుంఠపురములో', 'రెడ్' వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.