తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్

Wait 5 sec.

బాలీవుడ్‌ నటి , ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా తమ అభిమానులకు ఓ గుడ్‌న్యూస్‌ చెప్పారు. తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. త్వరలోనే తమ ఇంట్లోకి పండంటి బిడ్డ రాబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ''మా చిన్ని ప్రపంచం...త్వరలో రాబోతోంది'' అని పరిణీతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరిణీతి - రాఘవ్ చేతులు పట్టుకొని నడుస్తున్న వీడియోను షేర్ చేశారు. అలానే ఓ ఫోటోని పంచుకున్నారు. చిన్ని పాదాలు, 1+1=3 అని రాసి ఉన్న ఈ పిక్ నెట్టింట సందడి చేస్తోంది. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించడంతో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎంపీ రాఘవ్ - పరిణీతి కొన్నేళ్లపాటు ప్రేమాయణం సాగించి, 2023 సెప్టెంబర్‌లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌ రాష్ట్రం ఉదయ్‌పుర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఇటీవల కపిల్‌ షోలో పాల్గొన్న ఈ జంట త్వరలోనే గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఇప్పుడు పరిణీతి తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు.