కనీస వేతనమే రూ. 41 వేలు.. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే జీతం ఇంత పెరుగుతుందా?

Wait 5 sec.

Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సంఘం జీత భత్యాలను నిర్ణయిస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రతి పదేళ్లకు ఓసారి కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తుంటుంది. ఇక ఇప్పుడు 7వ వేతన సంఘం అమల్లో ఉండగా.. ఇది ఈ ఏడాది డిసెంబర్‌తో గడువు ముగియనుంది. అప్పుడు 8 వ వేతన సంఘం రావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సంవత్సరం ఆరంభంల ో జనవరిలోనే ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అలవెన్సులు, డీఏ వంటివి నిర్ణయించేందుకు కమిషన్ ఏర్పాటైంది. అమలు మాత్రం కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వేతన సంఘం అమల్లోకి ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఇతర అలవెన్సులు పెరుగుతాయని చెప్పొచ్చు. అందుకోసమే.. దీని కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి మనం ఇప్పుడు.. ప్రస్తుతం ఉన్న 7వ వేతన సంఘం, రాబోయే 8వ వేతన సంఘంలో ఏమేం తేడాలు ఉంటాయో చూద్దాం. 7వ వేతన సంఘం- హైలెట్స్: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 7 వేతన సంఘాలు అమలయ్యాయి. 2014లో 7వ వేతన సంఘం ఏర్పాటైంది. ఇక సిఫార్సులు మాత్రం 2016, జనవరి 1 నుంచి అమలయ్యాయి. ఇక్కడ అంతకుముందు పే కమిషన్‌తో పోలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మినిమం బేసిక్ పే (కనీస వేతనం) రూ. 7 వేల నుంచి రూ. 18 వేలకు పెరిగింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్: ఇది మీ జీతం ఎన్ని రెట్లు పెరుగుతుందో నిర్ణయిస్తుంది. 7వ వేతన సంఘంలో ఇది 2.57 గా ఉంది. అంటే మీ బేసిక్ పేను దీనితో మల్టిప్లై చేస్తే కొత్త జీతం ఎంతో తెలుస్తుంది. గత వేతన సంఘంలో డీఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ వంటి వాటిల్లో కీలక మార్పులు చేసింది. ఇక రిటైర్ అయిన ఉద్యోగుల కనీస పెన్షన్ రూ. 3500 నుంచి రూ. 9 వేలకు పెరిగింది. 8వ వేతన సంఘం- అంచనాలు ఇవే..: ఇది 2026, జనవరిలో అమలు కావాల్సి ఉంది. అన్ని సిఫార్సులకు ఆమోదం లభిస్తే.. ఇది అప్పుడే అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఆలస్యం కావొచ్చు. ఇక్కడ ఉద్యోగుల కనీస వేతనం రూ. 34,500-రూ. 41000 గా ఉండొచ్చని అంచనా. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ 2.86 గా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మేర జీతం పెరుగుతుందని చెప్పొచ్చు. ఇది విభాగాల్ని బట్టి వేర్వేరుగా ఉంటుందని చెబుతున్నారు. ఇక డీఏ ప్రస్తుతం 55 శాతంగా ఉండగా.. ఇది బేసిక్ పేలో విలీనమై మళ్లీ సున్నా నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్త వేతన సంఘంలో.. ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్స్ లేదా హై పెర్ఫామెన్స్ ఎంప్లాయీస్‌కు అదనంగా పే చేయడం వంటి విధానాన్ని తెచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 8వ వేతన సంఘం ఏర్పాటుతో దాదాపు 49 లక్షల , 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.