విద్యార్థులకు అలర్ట్.. ఆ రెండు యూనివర్సిటీల పరిధిలో పలు పరీక్షలు వాయిదా..

Wait 5 sec.

పోయిన వారం కాస్త గ్యాప్ ఇచ్చిన వానలు.. రెండు రోజుల నుంచి దంచి కొడుతున్నాయి. ఇక కొన్ని జిల్లాల్లో అయితే గంటల తరబడి ఆగకుండా వాన కురుస్తూనే ఉంది. దీంతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. . నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో విద్యాశాఖ.. పలు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు నేడు సెలవు ప్రకటించింది. ఇదిలా ఉంటే రెండు యూనివర్సిటీల పరిధిలో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆ వివరాలు.. భారీ వర్షాల నేపథ్యంలో కాకతీయ, శాతవాహన వర్సిటీల పరిధిలో గురువారం నిర్వహించాల్సిన పలు పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆ రెండు వర్సిటీల్లో ఒకటి కాకతీయ విశ్వవిద్యాలయం. కేయూ పరిధిలో ఆగస్టు 28, 29 అనగా గురు, శుక్ర వారాల్లో నిర్వహించాల్సి ఉన్న డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తన్నట్లు యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రకటన చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే గురు, శుక్ర వారాల్లో నిర్వహించాల్సిన పరీక్షలు మాత్రమే వాయిదా వేస్తున్నామని.. మిగతా రోజుల్లో నిర్వహించే పరీక్షలు అలానే కొనసాగుతాయని తెలిపారు. వాయిదా వేసిన ఎగ్జామ్స్‌ని ఎప్పుడు నిర్వహించే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుని.. ప్రకటన చేస్తామని తెలిపారు. ఇక కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ కూడా గురువారం నిర్వహించనున్న బీఎడ్, ఎంఎడ్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో భారీ వర్షం కురుస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం నుంచి మిగతా రోజుల్లో నిర్వహించే పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని తెలిపారు. వాయిదా వేసిన ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహించే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుని.. దీనిపై ప్రకటన చేస్తామని వెల్లడించారు.. యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు 28న అనగా నేడు జరగాల్సిన పీజీ, బీఈడీ, ఎంఈడీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అలానే వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని.. మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని కాలేజీ యాజమాన్యం తెలిపింది. భారీ వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. పలు మార్గాల్లో రైళ్లను కూడా రద్దు చేశారు. దీంతో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆయా వర్సిటీల డైరెక్టర్లు నిర్ణయం తీసుకుంటున్నారు.