: ఒక్కసారైనా విమానం ఎక్కి.. అలా ఆకాశంలో విహరించాలని ఎవరికి ఉండదు. చాలా మంది మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక కలగా ఉంటుంది. కానీ ధరే ఇక్కడ చాలా ఎక్కువ అని ఆగిపోతుంటారు. దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ ధరల్లో రైళ్లు, బస్సులు, క్యాబ్ సర్వీస్ అందుబాటులో ఉంటాయని విమాన ప్రయాణం చేసేందుకు వెనుకాడుతుంటారు. బాగా సంపాదించేవారికే విమాన ప్రయాణం అనేది ఒకప్పటి మాట మాత్రమే. ఇప్పుడు అంతా మారిపోయింది. సంపాదన తక్కువ ఉన్నా.. మధ్య తరగతి ప్రజలు కూడా విమాన ప్రయాణం చేస్తున్నారు. కారణం.. . ఎక్కువగా న్యూఇయర్, వాలెంటైన్స్ డే, హోలీ, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, క్రిస్మస్ ఇలాంటి సందర్భాల్లో.. రెగ్యులర్ కంటే తక్కువ ధరలకే విమాన ప్రయాణం కల్పస్తున్నాయి. ఇక్కడ బస్ టికెట్ ధర కంటే కూడా కొన్ని సార్లు తక్కువ రేట్లకు ఉండొచ్చు. ఇప్పుడు దేశంలో పండగల సీజన్ నడుస్తున్న వేళ.. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పే డే సేల్ లాంఛ్ చేసింది. ఇందులో భాగంగా కనీసం రూ. 1299 నుంచి దేశీయంగా ఫ్లైట్ టికెట్లు ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే ఈ సేల్ లాంఛ్ అవగా.. సెప్టెంబర్ 1 వరకు అందుబాటులో ఉంటుంది. అప్పటిలోగా టికెట్లు బుక్ చేసుకోవాలన్నమాట. పే డే సేల్ కింద ఎక్స్‌ప్రెస్ లైట్ ఫేర్ రూ. 1299 నుంచే ప్రారంభం అవుతుంది. ఇక ఎక్స్‌ప్రెస్ వాల్యూ ఫేర్స్ రూ. 1349 నుంచి మొదలవుతున్నాయి. ఇక ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకున్నవారు.. 2025, సెప్టెంబర్ 3 నుంచి 2026, మార్చి 31 వరకు ఎప్పుడైనా విమాన ప్రయాణం చేయొచ్చు. ఇదంతా వన్ వే టికెట్ ధర అని గుర్తుంచుకోవాలి. ఇది పరిమిత కాలపు ఆఫర్ కాబట్టి.. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అంటే.. ముందొచ్చిన వారికి సీట్లు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది అన్ని రోజులు, అన్ని ఫ్లైట్లు, అన్ని రూట్లలో అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా కేటాయించిన సీట్లు ఫిల్ అయిపోతే.. రెగ్యులర్ టికెట్ ధరలే వర్తిస్తాయి. ఈ ఆఫర్ వర్తించాలంటే.. లేదా తమ అధికారిక మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని చెబుతోంది.ఇదే సమయంలో ఇంటర్నేషనల్ లైట్ ఆఫర్ కింద విమాన టికెట్లు కనీసం రూ. 4876 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇది ఎక్స్‌ప్రెస్ లైట్ ఫేర్ కాగా.. ఎక్స్‌ప్రెస్ వాల్యూ ఫేర్ కింద రూ. 5403 నుంచి టికెట్లు ప్రారంభం అవుతున్నాయి. ఇక్కడ ఆగస్ట్ 28 నుంచి మార్చి 31 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు.