సీనియర్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్‌కు అద్భుతమైన పరిపాలనా అవకాశం లభించింది. తన పనితీరుతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. విధి నిర్వహణలోనే కాక సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టీవ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు, బోల్డ్ స్టేట్‌మెంట్స్ పోస్ట్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. ఇక తాజాగా మరోసారి పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కారణం ఆమె చేసిన ఓ పోస్ట్.తాజాగా స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. కొన్ని గడ్డు పరిస్థితులును ఎదుర్కొన్నానని.. కానీ ప్రస్తుతం తాను వాటి నుంచి నెమ్మదిగా బయటపడగలుగుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. తన పోస్ట్‌లో స్మితా సబర్వాల్.. ‘కొన్ని సార్లు మన జీవితాల్లో చాలా ప్రశాంతంగా ఉన్న సమయాలు.. మనకు చాలా గట్టి సమాధానాలు చెబుతాయి. నా వ్యక్తిగత విషయాలకు వస్తే.. గత కొన్ని నెలలు ఇలా గడిచాయా అనిపిస్తుంది. బాధాకరమైన విషయాల నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాను. చాలా కష్టంగా ఉన్నప్పటికీ... నేను కోలుకుంటున్నాను. ప్రతిరోజు ఎంతో కొంత మనో ధైర్యాన్ని అలవర్చుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈపోస్ట్ నెట్టింట తెగ వైరలవుతుంది. ఈ పోస్ట్ చూసిన నెటిజనులు.. మీకు ఏం జరిగిందో మాకు తెలియదు కానీ.. మీరు మాత్రం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వారందరికి స్మితా సబర్వాల్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం స్మితా సబర్వాల్ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. . వచ్చే నెల అనగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది అంటే 2026, జనవరి 31వ తేదీ వరకు ఆమె ఆరు నెలలు సెలవులు తీసుకున్నారు. ప్రస్తుతం స్మితా సబర్వాల్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఆరు నెలలు ఆమె చైల్డ్ కేర్ లీవ్ తీసుకుంటున్నట్లు తెలిపారు.స్మితా సబర్వాల్ తెలంగాణలో ‘పీపుల్స్ ఆఫీసర్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే ఆమె తెలంగాణలోని పలు జిల్లాలకు కలెక్టర్‌గా, అలానే సీఎంవో కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కలెక్టర్‌గా ఉన్న ఆమె అమలు చేసిన అనేక పథకాలు . అలానే ఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్మితా సబర్వాల్ సీఎంవో కార్యదర్శిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా అనేక ముఖ్య కార్యక్రమాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు.