: పండగ సీజన్లో కొత్త కారు కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అసలే ఈ పండగల సీజన్‌లో; ముఖ్యంగా దీపావళి, అక్షయ తృతీయ వేళ కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని భావిస్తుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పలు కార్ల తయారీ సంస్థలు మంచి మంచి ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. భారీగా డిస్కౌంట్ ఇవ్వడం సహా ఇతర ప్రోత్సాహకాలను ప్రకటిస్తుంటాయి. వాహనాలకు సంబంధించి ఇటీవల మరో శుభవార్త కూడా వచ్చిన సంగతి తెలిసిందే.జీఎస్టీలో సంస్కరణలు అమలు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఇందులో చాలా కార్లపై ప్రస్తుతం 28 శాతం GST అమల్లో ఉండగా.. దీనిని 18 శాతం స్లాబ్‌లోకి తీసుకురానున్నట్లు తెలిసింది. దీంతో కార్ల ధరలు భారీగా దిగిరావొచ్చు. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా.. తెలుస్తోంది. ఈ పండగ సీజన్‌లోపే దీనిపైన ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇదే సమయంలో ఇప్పుడు ఒక బ్యాంక్ శుభవార్త చెప్పింది. . వడ్డీ రేట్లలో కాస్త వ్యత్యాసంతో పెద్ద మొత్తంలో ఈఎంఐ ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు పండగల వేళ లోన్ తీసుకొని కారు కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్ ప్రకటించింది.కార్ లోన్లపై వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించింది. ఎంపిక చేసిన మోడళ్లను బట్టి.. ఏకంగా 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని గురువారం (ఆగస్ట్ 28) వెల్లడించింది. ఫ్లోటింగ్ కారు లోన్ వడ్డీ రేట్లు అంతకుముందు 8.40 శాతం నుంచి ప్రారంభమయ్యేవి కాగా.. ఇప్పుడు అది 8.15 శాతానికి దిగొచ్చినట్లు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియర్ స్పష్టం చేశారు. ఇక్కడ రుణ గ్రహీత క్రెడిట్ ప్రొఫైల్ బట్టి వడ్డీ రేట్లలో వ్యత్యాసం ఉంటుందని వెల్లడించారు.మరోవైపు ఆస్తుల తాకట్టుపై ఇచ్చే రుణాలపై (తనఖా రుణాలు) వడ్డీ రేట్లు భారీగా తగ్గించింది. గతంలో ఇది 9.85 శాతంగా ఉండగా.. ఇప్పుడు 9.15 శాతానికి దిగొచ్చింది. ఇక ఫిక్స్‌డ్ కార్ లోన్లపై వడ్డీ రేట్లు.. 8.65 శాతం నుంచి ప్రారంభం అవుతున్నట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ లోన్ 6 నెలల MCLR తో లింక్ అయి ఉండాలి. ఇక ఇప్పుడు ఇతర బ్యాంకులు కూడా పండగ సీజన్ వేళ.. మంచి మంచి ఆఫర్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.