ఒక్కరోజే రూ.20,000 పెరిగిన వెండి.. బంగారం ధరల్లో భారీ జంప్.. ఈరోజు గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే

Wait 5 sec.

: బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఎంత బంగారం ఉంటే అంత విలువ, గౌరవంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలకు బంగారు ఆభరణాలు ధరించేందుకు ఇష్టపడతారు. వందల ఏళ్ల నుంచి గోల్డ్ ఆభరణాలు ధరించే సంప్రదాయం కొనసాగుతోంది. కొందరు పురుషులు సైతం గోల్డ్ నగలు ధరిస్తారు. అలాగే పెళ్లిళ్లలో కట్నకానుకల్లో బంగారం కచ్చితంగా ఉండాల్సిందే. ఏదైనా పెళ్లి జరిగినప్పుడు బంగారం ఎంత పెడుతున్నారు అనే ప్రశ్న తప్పనిసరిగా ఎదురవుతుంది. అందుకే మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ వస్తే బంగారం దుకాణాలు కొనుగోలుదారులకు కిటకిటలాడుతుంటాయి. అయితే, గత కొన్ని నెలలుగా అమెరికా సుంకాలు, డాలర్, దేశాల మధ్య యుద్ధాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు అంటూ ఎన్నో కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా ఇరాన్ పై అమెరికా దాడి చేయవచ్చన్న అంచనాలు బంగారం ధర మళ్లీ పెరిగేందుకు కారణమవుతోంది. దీంతో వరుసగా మూడో రోజు రేట్లు పెరిగాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 22వ తేదీన ఆదివారం రోజు గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతెంత పలుకుతున్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేట్లు భగ్గుమంటున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సు ధర మళ్లీ 5100 మార్క్ దాటేసింది. ఈరోజు ఔన్స్ గోల్డ్ రేటు 128 డాలర్ల మేర పెరిగింది. దీంతో గోల్డ్ రేటు ఒక ఔన్సుకు 51068 డాలర్ల పైన పలుకుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఇవాళ ఏకంగా 8.92 శాతం మేర పెరిగింది. దీంతో ఔన్స్ వెండి రేటు 84.59 డాలర్లు పలుకుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా మూడో రోజూ పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.1750 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ. 1,45,000 మార్క్ తాకింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములపై రూ.1910 మేర పెరిగింది. దీంతో తులం ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,59,280 వద్దకు దూసుకెళ్లింది. రూ.20 వేలు పెరిగిన వెండిగత రెండు రోజులు స్థిరంగా ఉన్న సిల్వర్ రేటు ఇవాళ ఒక్కరోజే ఏకంగా రూ.20 వేలు పెరిగింది. దీంతో కిలో రూ.2,90,000 మార్క్ తాకింది. అయితే, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో వెండి ధరలు కాస్త తక్కువగానే ఉంటాయి. పైన చెప్పిన బంగారం, వెండి రేట్లు ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం రోజు ఉదయం 7 గంటలకు ఉన్న ధరలు. అయితే, బులియన్ మార్కెట్లో రేట్లు మధ్యాహ్నంలోపు మారుతుంటాయి. ప్రాంతాల వారీగా వేరు వేరుగా ఉంటాయి. కొనుగోలు చేసే ముందు స్థానికంగా ధరలు తెలుసుకుంటే మంచిది.