Price Hike: సామాన్య ప్రజలపై మరోసారి ధరల పిడుగు పడనుంది. లభించగా ఇప్పుడు ధరల పెంపునకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రోజువారీగా వినియోగించే సబ్బులు, షాంపూలు, టూత్ పేస్టులు, బ్రష్ ల వంటి ఎఫ్ఎంసీజీ వస్తువుల ధరలను కంపెనీలు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఆయా ఉత్పత్తుల ధరలను 5 శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఎఫ్ఎంసీజీ వస్తువులపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో కంపెనీలు ఆ మేరకు ధరలను తగ్గించేశాయి. ఇప్పటి వరకు ఈ వస్తువుల ధరలు స్థిరంగానే ఉన్నాయి. అయితే, జీఎస్‌టీ రేట్ల కోత ప్రభావం ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తయారీదారులు కొన్ని ఎఫ్ఎంసీజీ ప్రొడక్టు ల ధరలను 5 శాతం వరకు పెంచే పనిలో ఉన్నాయని జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. కమోడిటీ ధరల పెరుగుదల, రూపాయి క్షీణించడం వంటి కారణాలోత కంపెనీల మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడడమే ఇందుకు కారణంగా తెలిపాయి. అలాగే పెంచిన గరిష్ఠ విక్రయ ధర (MRP) లు ముద్రించిన ప్యాక్‌ల వస్తువులు ఇప్పటికే తమకు చేరినట్లు డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారని తెలిపాయి. డిటర్లెంట్లు, హెయిర్ ఆయిల్, చాక్లెట్లు, నూడిల్స్, టిఫిన్స్ వంటి పలు వస్తువుల ధరలు పెంచుతున్నట్లు సమాచారం. ఆఫీసర్ మోహిత్ మల్హోత్రా ఓ సందర్భంలో ఇప్పటికే వెల్లడించారు. 2026-27లోనూ ధరల పెంపు కొనసాగుతుందని సూత్రప్రాయంగా తెలిపారు. గృహ సంరక్షణ ఉత్పత్తుల ధరల పెంపు త్వరలోనే చేపడతామని, ఇప్పటికే పెంచిన ధరలతో వస్తువులు మార్కెట్లోకి పంపించామని హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ తెలిపింది. సర్ఫ్ ఎక్సెల్, విమ్, రిన్, డోమెక్స్ వంటి ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలోనే టీ ధరలను కొతం పెంచుతామని టాటా కన్సూమర్ ప్రోడక్ట్స్ కంపెనీ సైతం ప్రకటన చేయడం గమనార్హం.