IND vs SA: సూపర్ 8 సమరానికి సై.. సౌతాఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్, టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

Wait 5 sec.

లో భాగంగా మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ ఆసక్తికర మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా మారింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు కెప్టెన్ ఎంచుకున్నాడు. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.అహ్మదాబాద్ వేదికగా ఈ టీ20 వరల్డ్‌కప్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించడంతో సౌతాఫ్రికా బ్యాటింగ్‌కే మొగ్గు చూపింది. టీమిండియా ప్లేయింగ్ 11లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. నెదర్లాండ్స్‌తో ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగుతూ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇచ్చింది. సౌతాఫ్రికా మాత్రం పవర్ ఫుల్ ప్లేయింగ్ 11తో బరిలోకి దిగుతోంది. గ్రూప్ దశలో తిరుగులేని జట్లుగా నిలిచిన భారత్, సౌతాఫ్రికా పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. సూపర్ 8లో గ్రూప్ 1 నుంచి జరిగే తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం. గ్రూప్ 2 మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగా జరుగుతుంటే, గ్రూప్ 1 మ్యాచ్‌లు అన్నీ భారత్ వేదికగా జరుగుతుండటం విశేషం. మ్యాచ్‌తో గ్రూప్ 1 సమరం ఆరంభం అవుతోంది. గ్రూప్ 1లో భారత్, సౌతాఫ్రికాతో పాటు జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. ఈ నాలుగు జట్లలో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. చరిత్రలో సౌతాఫ్రికాపై టీమిండియాదే పైచేయి. మొత్తం 7 మ్యాచ్‌లలో ఇరు జట్లు తలపడితే భారత్ ఏకంగా 5 మ్యాచ్‌లలో విజయం సాధించింది. సౌతాఫ్రికా కేవలం రెండు మ్యాచ్‌లలోనే గెలిచింది. 2007, 2010, 2012, 2014, 2024లో భారత్ సౌతాఫ్రికాపై విజయం సాధించగా.. 2009, 2022లో ఓటమిపాలయింది. భారత జట్టు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్. సౌతాఫ్రికా జట్టుఎయిడెన్ మార్కరమ్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, ర్యాన్ రికెల్టన్, డివాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, మార్కో యాన్సన్, కగిసో రబడా, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి.