ZIM vs WI: సూపర్ 8లో జింబాబ్వే మళ్లీ ఝలక్ ఇస్తుందా? వాంఖడేలో విండీస్ ఫస్ట్ బ్యాటింగ్

Wait 5 sec.

లో ఈ రోజు ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్ స్టేజ్‌లో ఓటమి ఎరుగకుండా సూపర్ 8కి అర్హత సాధించిన వెస్టిండీస్ - జింబాబ్వే జట్లు ఈ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో వెస్టిండీస్ జట్టు తొలుత బ్యాటింగ్‌కి రానుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా లైవ్‌ను వీక్షించొచ్చు. వెస్టిండీస్ జట్టు ఈ టోర్నీలో తమ సత్తా చాటుతోంది. స్కాట్లాండ్, ఇంగ్లండ్, నేపాల్, ఇటలీను ఓడించి సూపర్ 8లో అడుగుపెట్టింది. స్కాట్లాండ్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించిన విండీస్, ఇంగ్లండ్‌పై 30 పరుగుల తేడాతో గెలిచింది. నేపాల్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించగా.. ఇటలీపై 42 పరుగుల తేడాతో గెలిచి సూపర్ 8లో నిలిచింది. జింబాబ్వే జట్టు ఈ మెగా ఈవెంట్‌లో అందరి అంచనాలను తారుమారు చేసింది. ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో ఓడించి టీ20 వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించేలా చేసింది. శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో గెలిచి తమ స్టామినా నిరూపించింది. ఒమన్‌పై 8 వికెట్ల తేడాతో గెలవగా.. ఐర్లాండ్‌పై వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. అనూహ్యంగా సూపర్ 8లో అడుగుపెట్టిన జింబాబ్వే టఫ్ ఫైట్ ఇవ్వడం ఖాయంలా కనిపిస్తోంది. వెస్టిండీస్ - జింబాబ్వే మధ్య నాలుగు టీ20 మ్యాచ్‌లు జరిగితే విండీస్‌దే పైచేయిగా ఉంది. 2010లో జింబాబ్వే 26 పరుగుల తేడాతో గెలవగా.. ఆ తర్వాత మూడు సార్లు వెస్టిండీసే విజయం సాధించింది. 2013లో రెండు మ్యాచ్‌లలోనూ వెస్టిండీస్ గెలుపొందింది. 2022 టీ20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్ 31 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. జింబాబ్వే జట్ట బ్రియన్ బెన్నెట్, టాడివానాషే మారుమాని (వికెట్ కీపర్), ర్యాన్ బర్ల్, సికందర్ రజా (కెప్టెన్), డియాన్ మైయర్స్, టోనీ మున్యోంగా, తషింగా ముసేకివా, గ్రేమ్ క్రీమర్, బ్రాడ్ ఎవాన్స్, రిచర్డ్ నగారావా, బ్లెసింగ్ ముజరబానీ.వెస్టిండీస్ జట్టుబ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (వికెట్ కీపర్/కెప్టెన్), షిమ్రోన్ హెట్‌మైర్, మాథ్యూ ఫోర్డ్, షెర్ఫేన్ రూధర్‌ఫోర్డ్, రోవ్‌మన్ పావెల్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకీల్ హోసేన్, గుడకేశ్ మోటి, షమార్ జోసెఫ్.