శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం: రూ.300 దర్శనం టికెట్లు దొరకలేదా.. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మరో ఛాన్స్..

Wait 5 sec.

ఏటా కనీసం ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలనేది ప్రతి హిందువు కనే కల. అందులో భాగంగా తమకు వీలైన విధంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. కొంతమంది నడక మార్గంలో మెట్లు ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే.. మరికొందరు , సుపథం ఇలా ఎవరికి కుదిరిన విధంగా వారు స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆన్‌లైన్ ద్వారా విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఎక్కువ మంది రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఆన్‌లైన్ విధానంలో అందరికీ లభించకపోవచ్చు. శ్రీవారి భక్తులకు అంతగా అవగాహన లేని విషయం ఏమిటంటే.. తిరుమల శ్రీవారిని మరో రకంగానూ దర్శించుకోవచ్చు. అదే తిరుమల దివ్యానుగ్రహ హోమం. అలిపిరిలోని సప్తగోప్రదక్షిణ మందిరంలో నిర్వహిస్తోంది. మార్చి నెలకు సంబంధించిన ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అయితే దివ్యానుగ్రహ హోమం టికెట్లు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జారీ చేస్తారు. మొత్తం 200 టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తారు. దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ ధర రూ.1600. దివ్యానుగ్రహ హోమం టికెట్ పొందిన వారికి.. హోమం పూర్తయిన అనంతరం, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అనుమతి ఇస్తారు. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ కింద ఇద్దరు భక్తులకు రూ.300 ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు దర్శన సదుపాయం కల్పిస్తారు. నాగలాపురం ఆలయంలో మహాసంప్రోక్షణనాగలాపురంలోని వేద నారాయణ స్వామి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆదివారం రోజున రాజగోపురానికి, ఆలయానికి మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహా సంప్రోక్షణలో భాగంగా వేద నారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.విమాన రాజగోపుర సంప్రోక్షణ , మూలమూర్తులకు మహా సంప్రోక్షణ ఆగమోక్తంగా నిర్వహించారు. మహా సంప్రోక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు.