PRISM Plans add 300 Hotels: దేశంలో ఓయో హోటల్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇతర హోటళ్లతో పోలిస్తే ఇక్కడ కాస్త అందుబాటు ధరల్లోనే వసతి సౌకర్యం ఉంటుందని చెబుతుంటారు. ఈ హాస్పిటాలిటీ టెక్నాలజీ ఫర్మ్, హోటల్ చైన్ ఓయో పేరెంట్ కంపెనీ ప్రిజమ్ ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది. తన నెట్‌వర్క్‌ను తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ విస్తృతంగా హోటల్స్ ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తన కార్యకలాపాల్ని మరింత పెంచుకునేందుకు కొత్తగా 300 సర్వీస్ హోటల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇప్పుడు హైదరాబాద్ వంటి ప్రధాన మెట్రో నగరాల్లోనే కాకుండా.. టైర్- 2, 3 సిటీలపైనా దృష్టి సారించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ హోటళ్లను విస్తరిస్తోంది. తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు.. యాదాద్రి, భద్రాచలం వంటి చోట్లనే ఎక్కువగా కొత్త ఓయో హోటల్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇక ఏపీలో వైజాగ్ సహా విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో ప్రీమియం హోటల్స్ సంఖ్యను పెంచేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పెరుగుతున్న మెడికల్ టూరిజం, బిజినెస్ డిమాండ్ సహా మెరుగైన రవాణా సౌకర్యాల్ని అందిపుచ్చుకునేందుకు ఓయో తన కార్యకలాపాల్ని విస్తరిస్తోంది. ఈ కొత్తగా ఏర్పాటు చేయనున్న 300 హోటల్స్.. ప్యాలెట్, సండే, టౌన్‌ హౌస్ వంటి ప్రీమియం బ్రాండ్‌ల ద్వారా నిర్వహించనున్నట్లు ప్రిజమ్ వెల్లడించింది. తెలంగాణ, ఏపీల్లోని మెరుగైన మౌలిక సదుపాయాలు, టూరిజం డిమాండ్ నేపథ్యంలో.. ఈ ప్రాంతాల్ని తమకు కీలకమైన మార్కెట్‌గా ఓయో భావిస్తోంది. ఇక . ఇప్పటికే సెబీకి ముసాయిదా పత్రాల్ని సమర్పించినట్లు తెలిసింది. సుమారు రూ. 6,650 కోట్ల వరకు నిధుల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఓయో సంస్థ విషయానికి వస్తే 2013లో రితేశ్ అగర్వాల్ దీనిని స్థాపించారు. . ప్రధానంగా బడ్జెట్ హోటల్స్, హాలిడే హోమ్స్‌పై దృష్టి పెడుతోంది. ఓయో (OYO) అంటే ఆన్ యువర్ ఓన్ అని అంటారు. హోటల్ బుకింగ్, ఆన్‌లైన్ వెకేషన్ రెంటల్ మార్కెట్ ప్లేస్, హాలిడే హోమ్స్ వంటి సేవల్ని అందిస్తోంది. ఆన్‌లైన్ బుకింగ్ యాప్ అందుబాటులో ఉండటం సహా సరసమైన ధరలు, దేశవ్యాప్తంగా 23 వేలకుపైగా హోటల్స్ నెట్‌వర్క్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. చెకిన్ సమయంలో గుర్తింపు కార్డు తప్పనిసరి.