ఏపీ ప్రభుత్వం ఇచ్చిన రూ. లక్ష కూపన్‌ నాకొద్దు.. వెనక్కి ఇచ్చేస్తున్నా: ఎమ్మెల్సీ ప్రకటన

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం రూ.లక్ష విలువైన కూపన్లు ఇచ్చింది. అయితే ఈ కూపన్ తనకు వద్దంటూ వెనక్కు ఇచ్చేశారు పీడీఎఫ్‌ . అసలు శానసమండలిలో బడ్జెట్‌పై చర్చ జరగనప్పుడు.. తమ గొంతు నొక్కుతున్నప్పుడు తనకు ప్రభుత్వం ఇచ్చిన రూ.లక్ష విలువైన కూపన్ తనకు ఎందుకని ఎమ్మెల్సీ గోపిమూర్తి ప్రశ్నించారు. తనకు ఈ కూపన్ అవసరం లేదని.. అందుకే తానను తిరస్కరిస్తున్నాను అన్నారు. ఈ కూపన్‌ను తిరిగి ప్రభుత్వానికే ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. అధికార, ప్రతిపక్షాలు బడ్జెట్‌తో పాటుగా ప్రజల సమస్యలపై శాసనమండలిలో చర్చ జరగకుండా సమయాన్ని వృథా చేస్తున్నాయని ఎమ్మెల్సీ గోపిమూర్తి మండిపడ్డారు. సభలో ఉన్న తమలాంటి స్వతంత్ర ప్రజాప్రతినిధుల సమయాన్ని, హక్కులను రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని భిన్నంగా ఉందన్నారు. బడ్జెట్‌లో అసలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, శ్రామికవర్గాలు, వేతన జీవుల ప్రస్తావన లేకపోడం బాధాకరమన్నారు. బడ్జెట్‌లో లోపాలను ఎత్తిచూపాల్సిన ప్రతిపక్షం కూడా సభ జరగకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ఇది కచ్చితంగా ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని.. ఇకనైనా శాసనమండలిలో ప్రజల సమస్యలపై చర్చించాలని సూచించారు. అంతేకాదు శాసనమండలిలో కంటే.. మాట్లాడాలంటే బయట వేదికలు చాలానే ఉన్నాయన్నారు.ఏపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున క్రోమా స్టోర్లలో చెల్లుబాటయ్యే కూపన్లు ఇచ్చింది. ప్రతి బడ్జెట్‌ సమావెశాలకూ కూపన్లు ఇవ్వడం ఆనవాయితిగా వస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బయటకు వచ్చే సమయంలో వారి నుంచి. సంతకాలు తీసుకుని కూపన్లు అందజేశారు. అయితే ఎమ్మెల్సీ గోపిమూర్తి మాత్రం తనకు వద్దని వెనక్కు ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది.గోపిమూర్తి నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తూ ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'ఏపీ ప్రభుత్వం ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి లక్ష రూపాయల చొప్పున గిఫ్ట్ కూపన్ అందించింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా లక్ష రూపాయలను క్రోమా షోరూమ్ లో చెల్లుబాటయ్యేలా ఇస్తే అన్ని పార్టీల వాళ్లు తీసుకున్నారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీతో పాటుగా వైఎస్సార్సీపీ వాళ్లు కూడా అందుకున్నారు. కానీ ఈ ఫోటోలో ఉన్న ఒక్కరు మాత్రం గిఫ్ట్ పేరుతో సుమారు రెండున్నర కోట్లను ఎమ్మెల్యేలకు పంచడం తప్పుబట్టారు. అలాంటి ప్రయత్నం వద్దన్నారు. తాను తీసుకోబోనని తేల్చేశారు. ఈ ఎమ్మెల్సీ పేరు గోపీమూర్తి. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ' అంటూ పోస్ట్ చేశారు. బొర్రా గోపిమూర్తి ఉభయగోదావరి జిల్లాల నుంచి పీడీఎఫ్ టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నారు.