భారీగా పెరిగిన బంగారం ధర.. మళ్లీ రూ.3,00,000 దాటిన వెండి.. ఈరోజు గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే

Wait 5 sec.

: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరల షాక్ తగులుతోంది. వారం క్రితం భారీగా దిగివచ్చిన బంగారం రేట్లు మళ్లీ వరుసగా పెరుగుతూ బెంబేలెత్తిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సుంకాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం, ఇరాన్ పై ఏ క్షణమైనా దాడి చేయవచ్చన్న అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాల వంటివి వాణిజ్య, రాజకీయ, భౌగోళిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇతర మార్గాల్లోని పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ భారీగా ఉంది. అలాగే దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో బంగారానికి గిరాకీ పెరిగింది. ధరలు పెరిగేందుకు ఇది ఒక కారణమవుతోందిని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక వెండి రేటు మళ్లీ రూ.3 లక్షల మార్క్ దాటింది. రెండు రోజుల్లోనే కిలో వెండి రేటు రూ.30 వేలు పెరిగింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం రోజున హైదరాబాద్ మార్కెట్లో ధరలు తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేట్లు మళ్లీ భారీగానే పెరిగాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 57.98 డాలర్లు పెరిగింది. దీంతో ఔన్స్ బంగారం రేటు 5165 వద్ద ట్రేడవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.88 శాతం పెరిగింది. దీంతో ఔన్స్ 86.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి ఏకంగా రూ.2070 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు రూ.1,61,350 వద్దకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.1900 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,47,900 వద్దకు చేరుకుంది.రూ.10 వేలు పెరిగిన వెండి క్రితం రోజు కిలో వెండి రేటు రూ.20 వేలు పెరగగా ఈరోజు మరో రూ.10 వేలు పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.3,00,000 మార్క్ దాటింది. మళ్లీ రికార్డ్ గరిష్ఠాల వైపు కదులుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం ఉదయం 7 గంటలకు ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో రేట్లు మధ్యాహ్నంలోపు మారిపోతుంటాయి. కొనుగోలు చేయాలనుకునే వారు తమ ప్రాంతంలోని ధరలు తెలుసుకోవడం మంచిది.