వెస్టిండీస్ దెబ్బకు షాక్‌లో భారత్.. ఒక్కసారిగా టీమిండియా సెమీస్ సీన్ రివర్స్!

Wait 5 sec.

దశలో భారత్‌కు సెమీఫైనల్ ఆశలు ఇప్పుడు గట్టిగానే కష్టాల్లో పడ్డాయి. సాధించడంతో గ్రూప్ 1లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు అద్భుతంగా చెలరేగి 254/6 భారీ స్కోరు నమోదు చేశారు. జింబాబ్వే ఆరంభంలోనే కుదేలై 147 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బ్రాడ్ ఎవాన్స్ చివరిదాకా పోరాడినా ఫలితం మారలేదు. ఈ విజయంతో వెస్టిండీస్ జట్టు నెట్ రన్‌రేట్ 5.35తో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు సౌతాఫ్రికా కూడా బలమైన స్థితిలో ఉంది. ఈ రెండు జట్లకూ ఇంకో విజయం చాలు సెమీస్‌కు అర్హత సాధించేందుకు.ఇదిలా ఉండగా భారీ ఓటమి తర్వాత -3.80 నెట్ రన్‌రేట్‌తో మూడో స్థానంలో నిలిచింది. భారత్‌కు ఇంకా జింబాబ్వేతో చెన్నైలో, వెస్టిండీస్‌తో కోల్‌కతాలో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌లలో గెలిచినా సరే, సెమీస్ అర్హత ఖాయం కాదు. దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్ ఫలితంపై భారత్ భవితవ్యం ఆధారపడి ఉంది. దక్షిణాఫ్రికా గెలిస్తే భారత్‌కు అవకాశాలు పెరుగుతాయి. వెస్టిండీస్ గెలిస్తే భారత్‌కు పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది.ప్రస్తుతం నెట్ రన్‌రేట్ భారీగా తగ్గిపోవడంతో, భారత్ విధి తన చేతుల్లో లేకుండా పోయినట్టే. ఇకపై ప్రతి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగాల్సి ఉంటుంది. సొంతగడ్డపై జరుగుతున్నా హోం ఫీల్ మాత్రం భారత్‌కు తప్ప మిగతా అన్ని జట్లకు ఉందనే భావన అభిమానుల్లో కలుగుతోంది. సౌతాఫ్రికా జట్టు సెమీస్ ఎంట్రీ దాదాపు ఖరారు కాగా.. వెస్టిండీస్, జింబాబ్వేపై ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు. ఇక వెస్టిండీస్ భారత్, సౌతాఫ్రికాపై ఒక్క మ్యాచ్‌లలో గెలవాలి. కానీ భారత్ మాత్రం జింబాబ్వే, వెస్టిండీస్‌పై ఘన విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ సౌతాఫ్రికా సూపర్ 8లో మూడు మ్యాచ్‌లు గెలిచి, భారత్ రెండు మ్యాచ్‌లలో గెలిస్తే టీమిండియా సెమీస్‌కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.